Begin typing your search above and press return to search.

హాస్యబ్రహ్మ వారసుడు మళ్లీ రాబోతున్నాడు

By:  Tupaki Desk   |   3 Dec 2021 12:30 AM GMT
హాస్యబ్రహ్మ వారసుడు మళ్లీ రాబోతున్నాడు
X
తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం బ్రహ్మానందం పేరు ఉంటుంది.. ఆయన నటించిన సినిమాలు.. ఆయన పోషించిన పాత్రలు.. ఆయన పండించిన కామెడీ ఇప్పటికి ఎప్పటికి బోర్ కొట్టవు. ఆయన రెండు మూడు తరాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న గొన్న నటుడు. హాస్య బ్రహ్మగా పేరు దక్కించుకున్న బ్రహ్మానందం తన కొడుకును ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టాలని చాలా ప్రయత్నించాడు. తనకున్న పరిచయాలతో చాలా ప్రయత్నాలు చేసినా కూడా రాజా గౌతమ్‌ సక్సెస్ లు దక్కించుకోలేక పోయాడు. బ్రహ్మాందంకు ఉన్న ఇమేజ్ నేపథ్యంలో గౌతమ్ నటించిన సినిమాలకు మంచి పబ్లిసిటీ అయితే దక్కింది కాని కమర్షియల్‌ విజయాలు కాలేక పోయాయి. అందుకే హాస్య బ్రహ్మా బ్రహ్మానందం తనయుడు ఇండస్ట్రీకి దూరంగా ఉండి పోయాడు.

కొన్ని సంవత్సరాల బ్రేక్ తర్వాత గౌతమ్‌ మళ్లీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. రీ ఎంట్రీ కోసం గత కొన్నాళ్లుగా మంచి కథలను ఎంపిక చేసే పనిలో ఉన్నాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గౌతమ్ కోసం ఒక కథ సిద్దం అయ్యింది.. ఆ కథకు తగ్గట్లుగా గౌతమ్ రెడీ అవుతున్నాడట. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. బ్రహ్మానందం తన పాపులారిటీని ఉపయోగించి గౌతమ్‌ ను అప్పుడు పరిచయం చేసేందుకు ప్రయత్నించాడు. ఇప్పుడు గౌతమ్‌ సొంతంగానే తన సత్తా ను నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేయబోతున్నాడు.

ఇప్పటికే గౌతమ్ నటుడిగా మరియు ఫిజిక్ పరంగా చాలా మార్పు వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందుకే గౌతమ్ ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటికే వచ్చిన ఎంతో మంది వారసుల్లో కొద్ది మంది మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకుని స్టార్స్ అయ్యారు. మరి గౌతమ్ రీ ఎంట్రీతో సక్సెస్‌ ను దక్కించుకుంటాడా అనేది చూడాలి. ఒక వేళ హీరోగా నిరాశ పర్చితే విలన్ గా లేదా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అయినా గౌతమ్ సినిమాల్లో నటిస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక బ్రహ్మానందం కూడా మళ్లీ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన అభిమానులు బ్రహ్మానందంను ఎప్పటికి వెండి తెరపై చూడాలని కోరుకుంటూ ఉన్నారు.