సమంత ఐటెం వల్లే 'పుష్ప' హిట్..

Thu May 26 2022 08:36:57 GMT+0530 (IST)

Bhanuchandra? comments on pushpa movie

పుష్ప సినిమా విడుదల అయ్యి ఆరు నెలలు అవుతున్నా కూడా దాని సందడి కొనసాగుతూనే ఉంది. థియేటర్ రిలీజ్ అయ్యి గత ఏడాదిలోనే బిగ్గెస్ట్ ఇండియన్ మూవీగా పుష్ప నిలిచింది. హిందీ వర్షన్ వంద కోట్లకు పైగా వసూళ్లు చేసి ప్రతి ఒక్కరు నోరు వెళ్లబెట్టేలా చేసింది. ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా అక్కడ పుష్ప విడుదల అయ్యింది. కేవలం హిందీ వర్షన్ మాత్రమే కాకుండా తమిళం.. కన్నడ ఇతర భాషల్లో కూడా పుష్ప కుమ్మేసింది.పుష్ప దాదాపుగా రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టింది అంటూ బాక్సాఫీస్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. అల్లు అర్జున్ ను చాలా విభిన్నంగా దర్శకుడు సుకుమార్ చూపించడం వల్లే సినిమా ఆ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందని కొందరు అంటే.. మరి కొందరు మరో రకంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. బన్నీ స్థాయి ఈ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగి పోయింది.

ఈ సమయంలో సీనియర్ హీరో భానుచందర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప గురించి షాకింగ్ వ్యాక్యలు చేసి అల్లు అర్జున్ అభిమానులకు కోపం వచ్చేలా చేశాడు. పుష్ప సినిమా కేవలం సమంత చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా ఊహూ అంటావా వల్లే హిట్ అయ్యింది అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆ పాట వల్లే సినిమా కు అంతటి గుర్తింపు వచ్చిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో బాలీవుడ్ సినిమాలను ఖచ్చితంగా మన తెలుగు సినిమాలు ఓవర్ టేక్ చేస్తాయనే నమ్మకం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వస్తున్న సౌత్ సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు ఇండియన్ సినిమాల మాదిరిగా నిలుస్తున్నాయి. కనుక ముందు ముందు సౌత్ నుండి భారీ సినిమాలు వస్తాయి అంటూనే పుష్ప గురించి పై విధంగా వ్యాఖ్యలు చేశాడు.

భాను చందర్ ఉద్దేశ్య పూర్వంగా అనకున్నా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అలా ఎలా అంటారు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బన్నీ వల్లే సినిమా ఆడింది. బన్నీకి గతంలోనే ఉత్తరభారతంలో గుర్తింపు ఉంది. సమంత ఐటెం సాంగ్ తెలుగు లో హిట్ అయ్యింది కాని ఇతర భాషల్లో కాలేదు అన్నట్లుగా బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఐటెం సాంగ్స్ వల్ల సినిమా హిట్ అవ్వడం ఏంటీ విడ్డూరం కాకుంటే.. అయినా వందల కోట్లు.. అది కూడా పాన్ ఇండియా స్థాయి విజయం అనేది కేవలం ఐటెం సాంగ్ వల్ల ఎంత వరకు సాధ్యం అయ్యేనో ఒక సీనియర్ నటుడిగా ఆయనకే తెలియాలంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో పుష్ప సినిమా గురించి భాను చందర్ చేసిన వ్యాఖ్యల గురించి చర్చ జరుగుతోంది.