Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ భానుశ్రీ లో దుస్తుల‌తో టెంప్టింగ్

By:  Tupaki Desk   |   26 Feb 2020 12:27 PM GMT
బిగ్ బాస్ భానుశ్రీ లో దుస్తుల‌తో టెంప్టింగ్
X
సోష‌ల్ మీడియా ట్రెండ్ లో తెలుగ‌మ్మాయిలు దేనికీ అద‌ర‌డం లేదు బెద‌ర‌డం లేదు. స‌నాత‌న సాంప్ర‌దాయాలు పేరుతో అందాల్ని దాచుకునే ఆలోచ‌న‌తో అస‌లే లేరు. ఇటీవ‌ల ప‌లువురు తెలుగ‌మ్మాయిల ఫోటోషూట్లు అంత‌ర్జాలంలోకి దూసుకొచ్చిన తీరు ప‌రేషాన్ చేసింది. బ్యాక్ లెస్.. స్ట్రాప్ లెస్.. షోల్డ‌ర్ లెస్.. స్లీవ్ లెస్.. అంటూ అందాల్ని ఆర‌బోసేందుకు ఏమాత్రం వెన‌కాడ‌డం లేదు.

ఆ కోవ‌లోనే ఇదిగో మ‌రో తెలుగమ్మాయి గుబులు రేకెత్తిస్తోంది. బిగ్‌బాస్ ద్వారా వెలుగులోకి వచ్చిన భానుశ్రీ వెండితెర బుల్లితెర అనే తేడా లేకుండా గొప్ప ఫాలోవ‌ర్స్ ని సంపాదించుకుంది. సోష‌ల్ మీడియాల్లోనూ ఈ అమ్మ‌డికి ల‌క్ష‌ల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవ‌లే ఏడు చేపల కథతో ఈ భామ ఘాటైన రొమాన్స్ చేసి అభిమానుల్లో సెగలు పుట్టించింది.

అంతేకాదు నిరంత‌రం సోషల్ మీడియాలో తన అభిమానులకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందించడంలో ఈ భామ ముందుంటోంది. రెగ్యుల‌ర్ గా వేడెక్కించే ఫోటోషూట్ల‌తోనూ విరుచుకుప‌డుతోంది. లేటెస్టుగా భానుశ్రీ ఇన్ స్టాలో చెల‌రేగింది. ``అమ్మాయి అంటే స్ట్రాంగ్ గా గ‌ట్సీగా ఉండాలి. ఏం చేసేందుకైనా వెన‌కాడ‌ని.. భ‌యం అన్న‌దే లేనివారిగా.. ధైర్యంగా .. ఇండిపెండెంట్ గా అమ్మాయిలు ఉండాలి. అస‌లు దేనికీ మెన్ అవ‌స‌ర‌మే లేదు. వెనుతిరిగి చూడాల్సిన ప‌నే లేకుండా అమ్మాయిలు ఉండాలి. గ‌ర్ల్ ప‌వ‌ర్ ఏంటో చూపించాలి`` అంటూ భానుశ్రీ కాస్త ఘాటుగానే కొటేష‌న్ ఇచ్చింది. ఒక ర‌కంగా భానుశ్రీ‌లోని రెబ‌లిజం అలా ఈ ఫోటో ద్వారానే బ‌య‌ట‌ప‌డింది. ముంబై భామ‌ల‌కైనా ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాలి అన్న తీరుగా ఉందీ ఫోజు. తాజాగా పోస్ట్ చేసిన ఫోటో ఫ్యాన్స్ లోకి జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. ముఖ్యంగా తెలుగ‌మ్మాయి అయినా ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండా ఇంత రెబ‌ల్ యాటిట్యూడ్ తో అమ్మ‌డు ఇచ్చిన ఫోజు కిర్రాక్ పుట్టించింది. లోదుస్తులు.. పొట్టి నిక్క‌రుతో భాను హ‌ద్దులే చెరిపేసింది అంటూ ఫ్యాన్స్ వేడెక్కిపోతున్నారు.