Begin typing your search above and press return to search.

#లిప్ లాక్.. భాయ్ ఇది ఎంతటి తీయ‌ని మోసం?

By:  Tupaki Desk   |   7 May 2021 12:30 PM GMT
#లిప్ లాక్.. భాయ్ ఇది ఎంతటి తీయ‌ని మోసం?
X
హీరోయిన్ తో లిప్ లాక్ లాగించేయ‌మంటే వ‌ర‌ల్డ్ రికార్డులు కొట్టే హీరోలున్నారు. సుదీర్ఘ చుంబ‌నాల్లో రికార్డులు నెల‌కొల్పిన ఘ‌నాపాటీలైన హీరోలు మ‌న‌కు తెలుసు. క‌మ‌ల్ హాస‌న్ - అమీర్ ఖాన్- ఇమ్రాన్ హ‌స్మీ.. ఇలా క్యూ చాంతాడంత ఉంది. కానీ వీళ్లంద‌రి కంటే భిన్న‌మైన‌వాడు స‌ల్మాన్ భాయ్. అత‌డు అస‌లు ప‌బ్లిగ్గా హీరోయిన్ కి ముద్దు పెట్ట‌డు. లిప్ లాక్ వేయాలంటే కండీష‌న్స్ అప్ల‌య్ అని ముందే చెప్పేస్తాడు.

కానీ ఇప్పుడు రూల్ ని అతిక్ర‌మించాడు. దిశా ప‌టానీతో డీప్ లిప్ లాక్ వేశాడు. `రాధే : యువ‌ర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` చిత్రంలో ఆ లిప్ లాక్ ని అభిమానులు వీక్షించ‌వ‌చ్చు. ఇంత‌కుముందు ట్రైల‌ర్ లోనూ ఈ లిప్ లాక్ ని హైలైట్ చేయ‌గా పెద్ద డిబేట్ న‌డిచింది. అయితే ఇది నిజ‌మైన లిప్ లాక్ కాద‌ని ఆ త‌ర్వాత దిశా ప‌టానీ వెల్ల‌డించింది.

లిప్ లాక్ వేయ‌కుండా దిశా పెద‌వుల‌కు ఓ పెద్ద ప్లాస్ట‌ర్ నే వేశారు. ఆ లిప్ లాక్ సీన్ తెర‌కెక్కించిన విధానానికి సంబంధించి తాజాగా కొన్ని ఫోటోలు వైర‌ల్ గా మారాయి. ప్రభుదేవా దర్శకత్వం వహించిన యాక్షన్‌ సినిమా రాధే లో దిగ్గ‌జాలు నటించారు. జాకీ ష్రాఫ్ - రణ్‌దీప్‌ హుడా ముఖ్య పాత్రల్లో నటించారు. మే 13న ఈ చిత్రం ఓ వైపు థియేటర్లలో మరోవైపు ఓటీటీలో విడుదలవుతోంది. అయితే ఓటీటీలో పే పర్‌ వ్యూ విధానంలో అమ‌ల‌వుతుంది.