సూపర్ స్టార్ తల్లిగా రాధేశ్యామ్ బ్యూటీ.. నిజమెంత?

Mon Jul 13 2020 13:00:05 GMT+0530 (IST)

Bhagyashree crucial role in Mahesh Babu film?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఎప్పుడైతే తన కొత్త సినిమా 'సర్కారు వారి పాట' టైటిల్ ప్రకటించాడో.. అప్పటి నుండి ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ కోసం తంటాలు పడిన టీమ్ చివరిగా కీర్తిసురేష్ ను ఓకే చేసింది. అలా ఒక్కో పాత్ర గురించి చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాను పరశురామ్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. మంచి రొమాంటిక్ కామెడీ జానర్లో రూపొందనున్న ఈ సినిమాలో కొన్ని సామాజిక అంశాలు కూడా కీలకం కానున్నాయట. ఇక హీరో బ్యాంకు మేనేజర్ అంటూ.. సినిమా భారీ కుంభకోణం నేపథ్యంలో సాగుతుందని వార్తలు వస్తున్నాయి.మహేష్ 27వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ కొత్త స్టైల్ లో అలరించనున్నాడని అర్ధమవుతుంది. ఇదివరకే విడుదల చేసిన ఫస్ట్ లుక్.. టైటిల్ కు మంచి స్పందన లభించింది. ఇక మహేష్ హెయిర్ స్టైల్.. టాటూ చూసే సరికి అభిమానులలో మరింత ఆసక్తి పెరిగిందని చెప్పాలి. ఇదిలా ఉండగా సర్కారు వారి పాటలో మహేష్ బాబు తల్లి పాత్ర కూడా ముఖ్యమేనట. ఆ పాత్ర కోసం పలువురిని పరిశీలించిన బృందం చివరగా బాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ భాగ్యశ్రీని సంప్రదించిందట. మరి మహేష్ బాబుకి తల్లిగా నటించడానికి భాగ్యశ్రీ కూడా సానుకూలంగా తలూపిందని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం ఆమె ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో నటిస్తోంది. ఈ విషయం పై సర్కారు వారి పాట బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నాడు.