సల్మాన్ నాయిక ప్రభాస్ కి మదర్

Wed Jan 22 2020 18:24:09 GMT+0530 (IST)

Bhagya Shree Playing Prabhas Mother Role

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా జాన్ చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. పెదనాన్న కృష్ణంరాజు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటోని రిలీజ్ చేసారు. ప్రభాస్ కొత్త లుక్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. పాన్ ఇండియా మూవీ సాహో ఆశించిన ఫలితాన్నివ్వని నేపథ్యంలో జాన్ పై డార్లింగ్ పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ ప్రయత్నం బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందేనన్న పంతంతో ఉన్నాడు.జాన్ చిత్రీకరణ అంతకంతకు ఆలస్యం అవ్వడంతో 2020 సమ్మర్ కి రావాల్సినది కాస్తా చాలా దూరం జరిగిపోయింది. 2021 ఏప్రిల్ లోనే సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించిన కృష్ణంరాజు ఫ్యాన్స్ కి పెద్ద షాకిచ్చారు. ఇందులో ప్రభాస్ జోడీగా ముంబై బ్యూటీ పూజాహెగ్దే నటిస్తుండగా.. కీలక పాత్రల్లో ఇరుగు పొరుగు పరిశ్రమల తారలు నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ నుంచి కొందరిని ఇంపోర్ట్ చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పీరియాడిక్ లవ్ స్టోరీ .. కాబట్టి  ఆన్ స్క్రీన్ ప్రభాస్- పూజా రొమాన్స్ హైలైట్ గా నిలువనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కేవలం లవ్ రొమాన్స్ మాత్రమే కాదు.. మదర్ సెంటిమెంట్ అంతే హైలైట్ గా నిలుస్తుందని సమచారం. ప్రభాస్ కు తల్లి పాత్ర కోసం వెటరన్ నటి భాగ్యశ్రీని ఎంపిక చేసారని తెలుస్తోంది. భాగ్య శ్రీ గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన మైనే ప్యార్ కియా (ప్రేమ పావురాలు) సినిమాతో భాగ్యశ్రీ కథానాయికగా పరిచయమయ్యారు. తర్వాత కన్నడ- భోజ్ పురి చిత్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. అటుపై  తెలుగులో యాంగ్రీస్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన `ఓంకారం`లో నటించారు. తర్వాత ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కన్నడ సినిమాలే ఎక్కువ చేసారు.

ఆ మధ్య  అడవి శేషు- శివానీ జంటగా ప్రారంభమైన `2 స్టేట్స్` చిత్రంలో ఓ కీలక పాత్రకు అంగీకరించారు. ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు `జాన్` లో ప్రభాస్ కు తల్లి పాత్రలో  నటించే అవకాశం అందుకున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ని ఆస్ట్రియాలో ప్లాన్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ లో భాగ్య శ్రీ జాయిన్ కానున్నారని సమాచారం.