Begin typing your search above and press return to search.

'భార‌తీయుడు 2 'ఫేక్ హ‌ల్ చ‌ల్

By:  Tupaki Desk   |   6 Dec 2019 8:08 AM GMT
భార‌తీయుడు 2 ఫేక్ హ‌ల్ చ‌ల్
X
ఏదైనా క్రేజీ కాంబినేష‌న్ తో భారీ చిత్రం సెట్స్ పై ఉంది అంటే అభిమానుల్లో ఉండే ఉత్సాహం వేరుగా ఉంటుంది. అందునా శంక‌ర్ లాంటి క్రేజీ డైరెక్ట‌ర్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు అంటే దానిపై ఆరాలు ఎక్కువ‌గానే ఉంటాయి. ఏ చిన్న విష‌యం అయినా వైర‌ల్ గా ప్ర‌చార‌మ‌వుతుంది. భార‌తీయుడు 2 (ఇండియన్ 2) ప్రారంభ‌మైంది మొద‌లు ఆ సినిమా అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ స్ట్ర‌గుల్స్ పై నెగెటివ్ ప‌బ్లిసిటీ తెలిసిందే. ఎన్న‌డూ లేనంత‌గా ఈ ప్రాజెక్టుపై నెగెటివిటీ ప‌రాకాష్ట‌కు చేరుకుంది.

అదంతా ఒకెత్తు అనుకుంటే లైకా ప్రొడ‌క్ష‌న్స్ బృందం ఎలాంటి పోస్ట‌ర్లు రిలీజ్ చేయ‌కుండానే ఇదిగో క‌మ‌ల్ హాస‌న్ లుక్ అంటూ ఓ ఫేక్ పోస్ట‌ర్ అప్ప‌ట్లో హ‌ల్ చ‌ల్ చేసింది. క‌మ‌ల్ హాస‌న్ సేనాపతి లుక్ ఇదేనంటూ ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్లు హ‌ల్ చ‌ల్ చేసాయి. వాట‌న్నిటిపైనా విస్త్ర‌తంగానే జ‌నంలో టాక్ వినిపించింది. ఇక ఇటీవ‌ల రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో షూటింగు కి సంబంధించిన ప‌లు ఫోటోలు లీకై అభిమానుల్లో హీటెక్కించాయి.

తాజాగా మ‌రో కొత్త పోస్ట‌ర్ రివీలైంది. ఇది అధికారిక పోస్ట‌ర్ అంటూ ఓ ఫేక్ పోస్ట‌ర్ ని క‌మ‌ల్ హాస‌న్ అభిమానులు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ గా ప్ర‌మోట్ చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇది ఫేక్ అయినా ఒరిజిన‌ల్ ని మించి మురిపిస్తోంది. క‌మ‌ల్ సేనాప‌తి లుక్ ఇది. కొన్ని డాక్యుమెంట్స్ చేత‌ప‌ట్టిన సేనాప‌తి ఫోటో.. ఒక దిన‌ప‌త్రిక బ్యాక్ డ్రాప్ లో ఎంతో స్ట్రైకింగ్ గా క‌నిపిస్తోంది. అవినీతిపై భార‌తీయుడు ఎక్కుపెట్టిన యుద్ధం ఆ పోస్ట‌ర్ లో క‌నిపిస్తోంది. అప్ గ్రేడెడ్ స‌మాజంలో అవినీతి అస్త‌వ్య‌స్థ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌పై ఈసారి శంక‌ర్ గురి పెట్టార‌న్న ప్ర‌చారం ఉంది. తాజా పోస్ట‌ర్ ఫేక్ నా లేక ఒరిజిన‌లా? అన్న‌ది అటుంచితే జ‌నంలో ఆలోచ‌న రేకెత్తించింద‌న‌డంలో సందేహం లేదు. భార‌తీయుడు 2పై నెగెటివ్ ప్ర‌చారం.. ఫేక్ ప్ర‌చారం ఏదైనా కానీ అంతిమంగా అది సినిమా ప‌బ్లిసిటీ కి క‌లిసొస్తోంద‌నే చెప్పాలి.