జీవితంలో బెస్ట్ మూమెంట్ : మురుగదాస్

Mon Nov 18 2019 16:20:58 GMT+0530 (IST)

Best Moment In Life: Murugadas

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'దర్బార్'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. చాలా స్పీడ్ గా ఈ సినిమా పూర్తి అయ్యింది. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం కోసం రజినీకాంత్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మురుగదాస్ కు ఉన్న జాతీయ స్థాయి స్టార్ డం కారణంగా ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రజినీకాంత్ కనిపించబోతున్నాడు. నయనతార హీరోయిన్ గా నటించగా నివేదా థామస్ సూపర్ స్టార్ కూతురు పాత్రలో కనిపించబోతుందట. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఇలాంటి సమయంలో సినిమా గురించిన మరో ఆసక్తికర ప్రకటన చేసిన మురుగదాస్ సినిమాపై అంచనాలు పెంచడంలో విజయవంతం అయ్యాడని చెప్పుకొవచ్చు.

ఇటీవల రజినీకాంత్ డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేశాడట. రజినీకాంత్ తో డబ్బింగ్ చెప్పించిన తర్వాత మురుగదాస్ స్పందిస్తూ జీవితంలో ఇదొక బెస్ట్ డబ్బింగ్ సెషన్ అంటూ ట్వీట్ చేశాడు. తలైవర్ డబ్బింగ్ పూర్తి అంటూ మురుగదాస్ ఈ ఫొటోను షేర్ చేశాడు. రజినీకాంత్ స్టైల్ తో పాటు ఆయన డబ్బింగ్ కూడా ఈసారి సినిమాకు హైలైట్ గా ఉండబోతుందన్నమాట. సంక్రాంతికి తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదలకు సిద్దం అవుతున్న 'దర్బార్' తో రజినీకాంత్ దడదడలాడించడం కన్ఫర్మ్ అంటూ తలైవర్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.