Begin typing your search above and press return to search.

సినిమాల‌తో పోయినది వెబ్ సిరీస్ ల‌తో ర‌ప్పిస్తారా?

By:  Tupaki Desk   |   20 Oct 2020 6:00 AM GMT
సినిమాల‌తో పోయినది వెబ్ సిరీస్ ల‌తో ర‌ప్పిస్తారా?
X
ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ లో రిలీజ‌వుతున్న సినిమాల రిజ‌ల్ట్ నిరాశ‌ప‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. తానొక‌టి త‌లిస్తే.. ఇంకేదో అవుతోంది. ఇత‌ర డిజిట‌ల్ మాధ్య‌మాల‌తో పోలిస్తే అమెజాన్ లో తెలుగు సినిమాల వెల్లువ కాస్త ఎక్కువగా ఉన్నా స‌క్సెస్ రేటు త‌క్కువగా ఉంది.

వెబ్ సిరీస్ ల‌ను న‌మ్ముకున్న అమెజాన్ ప్రైమ్ వ్యూయ‌ర్ షిప్ తో పాటు సబ్ స్క్రిప్ష‌న్ కూడా వెబ్ సిరీస్ లు ద్వారా ఎక్కువుగా వ‌స్తున్నట్లుగా అమెజాన్ బృందాలు చెబుతుండ‌డం విశేషం. అయితే కొన్ని సినిమాల ద్వారా కూడా అమెజాన్ బాగానే క‌లిసి వస్తున్నా.. కొన్ని పెద్ద సినిమాలు తీవ్రంగా నిరాశప‌ర‌చ‌డం మైన‌స్ గా మారుతోంది. ప్ర‌స్తుతం అమెజాన్ లో రిలీజ్ కి రెడీగా ఉన్న వెబ్ సిరీస్ మీర్జాపూర్ 2.. పైనే అంద‌రి దృష్టి.

ఈ వెబ్ సిరీస్ కి ఆల్ ఇండియ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్ప‌టికే సీజ‌న్ 1 ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ వెబ్ సిరీస్ మొత్తం భూతులు.. సెక్స్ మాత్ర‌మే ఉంటుంది. చివ‌రికి అమెజాన్ లోనూ భూతులనే న‌మ్ముకోవాల్సిన పరిస్థితి వ‌చ్చేసిందిగా అంటూ నేటి నెటిజ‌న్ కామెంట్ చేస్తుండ‌డం విశేషం. నెట్ ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ సైట్ తో పోలిస్తే అమెజాన్ ప్రైమ్ సాంప్ర‌దాయ‌క ఫ్యామిలీ ఆడియెన్ కి వినోదం పంచుతుంద‌న్న అవ‌గాహన ఇప్ప‌టికే ఉంది. అయితే అందుకు భిన్నంగా వేడెక్కించే బూతు కంటెంట్ ఎక్కువ‌వుతోంద‌న్న విమ‌ర్శ‌లు మం‌చింది కాదేమో! మునుముందు వెబ్ డిజిట‌ల్ కంటెంట్ కి సెన్సార్ షిప్ ప్లాన్ చేస్తున్నారంటే ఈ ప‌రిణామం వ‌ల్ల‌నే అని విశ్లేషిస్తున్నారు.