2022 బెస్ట్ బికినీ గాళ్స్ ఎవరో తెలుసా?

Wed Jul 06 2022 11:18:14 GMT+0530 (IST)

Best Bikini Girls Of 2022?

బికినీలు పలు రకాలు. మోనోకిని.. బాండేయుకిని.. మైక్రోకిని.. స్కిర్టినీ .. ఇంకా చాలా రకాల వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. హై-వెస్ట్ బికినీ అనేది వేరొక రకం. మొత్తానికి బికినీ ఏది అయినా కానీ కుర్రకారు గుండెల్లో మంటలు పెట్టడంలో బెస్ట్ అని ప్రూవ్ అయ్యింది. తాజాగా అంతర్జాతీయ బికినీ దినోత్సవం సందర్భంగా 30 అంగుళాల ఫాబ్రిక్ బికినీ గురించి చాలా చర్చ సాగింది.



బికినీలు ధరించడంలో స్పెషలిస్టులు ఎందరున్నారు? అన్నది వెతికితే..  ఈషా గుప్తా- దిశా పటానీ- నోరా ఫతేహి- జాన్వీ కపూర్- మలైకా అరోరాఖాన్ లాంటి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. బికినీ డే 2022 సందర్భంగా భారతదేశంలోని టాప్ 5 బికినీ బేబీస్ గురించి చర్చ సాగింది.

హాటెస్ట్ బికినీ బాడీలతో అలరించే బాలీవుడ్ నటీమణుల్లో ఈషా గుప్తా అన్నివేళలా ముందుంటుంది. ఈషా గుప్తా హాట్ నెస్ పర్సనఫైడ్! బాలీవుడ్ నటి ఈషా గుప్తా బికినీ ధరిస్తే ఆవిరులు పుట్టాల్సిందే. ఇంతకుముందు 'ఆశ్రమ్ 3' విడుదలైనప్పటి నుండి ఈషా తన బికినీ బాడీతో మరింతగా చెలరేగిపోతోంది. అంతర్జాతీయ బికినీ దినోత్సవం రోజున ఈషా గుప్తా తన హాటెస్ట్ లుక్ ని ఆవిష్కరించింది.

నోరా ఫతేహి అద్భుతమైన బికినీ క్వీన్. నోరా ఫతేహి ఈ ఏడాదిలో హాటెస్ట్ బికినీ బాడీని ప్రదర్శించింది. ఇంతకుముందు స్కర్ట్ తో ప్రింటెడ్ బికినీని ధరించి తన హాట్ కర్వ్ లను చూపడం కోసం పోటీపడింది.

మలైకా అరోరాఖాన్ బాలీవుడ్ హాటెస్ట్ బికినీ గాళ్ గా వెలిగిపోతోంది. అర్జున్ తో కలిసి బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో చెలరేగిపోయే ఈ బ్యూటీ పలుమార్లు హాట్ బికినీ అవతారాల్ని షేర్ చేయగా వెబ్ ని అట్టుడికించాయి.

అందానికి అందం కవ్వింతలో ఎప్పుడూ ముందుంటే దిశా పటానీ బికినీ బీచ్ లో చెలరేగిపోతుంటుంది. ఇటీవల మాల్దీవుల విహారం నుంచి ఇతర బీచ్ వెకేషన్ల నుంచి తన హాటెస్ట్ బికినీ అవతార్ లను షేర్ చేయగా వెబ్ లో హీట్ పుట్టించాయి.

సారా అలీ ఖాన్ పూల్ సైడ్ ట్రీట్ గురించి చెప్పనవసరం లేదు. మాల్దీవులు తన ఫేవరెట్ డెస్టినేషన్. సారా అలీ ఖాన్ త్రోబ్యాక్ బికినీ ఫోటోగ్రాఫ్ లో మల్టీ-కలర్ ప్రింటెడ్ బికినీలో పర్ఫెక్ట్ టోన్డ్ ఫిజిక్ తో కనిపించింది. అలాగే మరో కుర్ర బ్యూటీ జాన్వీ కపూర్ అందమైన ఆకుపచ్చ బికినీలో అలరించింది. జాన్వీ కపూర్ ధరించిన ఆకుపచ్చ ఫ్లోరల్ బికినీ.. చీరకట్టును తలపించినా డామినేట్ చేసిందని ప్రశంసలు కురిసాయి. ఆకుపచ్చ బికినీలో జాన్వీ కపూర్ హాట్ గా బీచ్ గోల్స్ ని సెట్ చేసింది. నేటితరంలో కియరా అద్వాణీ.. సీనియర్లలో కత్రిన కైఫ్ బికినీలకు వన్నె తెచ్చారనడంలో సందేహం లేదు. గాయని షామా శికందర్ సైతం బోల్డ్ గా బికినీలతో విరుచుకుపడుతూ కుర్రకారు కంటికి కునుకు పట్టనివ్వని ట్రీటిస్తోంది.