అల్లుడు శీను అప్పుడే పెళ్లి కొడుకు అవ్వనున్నాడట!

Tue Aug 13 2019 23:00:01 GMT+0530 (IST)

Bellamkonda Srinivas Marriage

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ 'అల్లుడు శీన' చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమా నుండి కూడా భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ మాస్ ఆడియన్స్ లో మంచి గుర్తింపును అయితే దక్కించుకున్నాడు. అయితే ఇంత కాలం చేసిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఎట్టకేలకు 'రాక్షసుడు' చిత్రంతో ఆ కమర్షియల్ సక్సెస్ అనేది దక్కింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇన్నాళ్లకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మంచి సక్సెస్ దక్కిందని అంతా అంటున్నారు. బెల్లంకొండ ఫ్యామిలీ కూడా ఈ సక్సెస్ పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా బెల్లంకొండ సురేష్ కూడా హాజరు అయ్యారు. ఈ సందర్బంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ సాయి శ్రీనివాస్ పెళ్లి విషయమై మాట్లాడటం జరిగింది.

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. రాక్షసుడు' చిత్రంను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక శ్రీనివాస్ పెళ్లి గురించి స్పందిస్తూ త్వరలో పెళ్లి చేయాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీ అమ్మాయిని కాకుండా బయట ఫ్యామిలీకి చెందిన తగిన జోడీ అమ్మాయిని చూసి శ్రీనివాస్ పెళ్లి చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు నాలుగు పదుల వయసు దగ్గరకు వస్తున్నా పెళ్లి చేసుకోకుండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలు పెడుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను అప్పుడే పెళ్లి పీఠలు ఎక్కించాలని సురేష్ భావించడం ఆశ్చర్యంగా ఉంది. ఆయన నిర్ణయం వెనుక ఎలాంటి ఉద్దేశ్యం ఉందో మరి..!