Begin typing your search above and press return to search.

ఛత్రపతి రీమేక్ లో ఇదే పెద్ద కష్టం అంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

By:  Tupaki Desk   |   3 Aug 2021 11:30 PM GMT
ఛత్రపతి రీమేక్ లో ఇదే పెద్ద కష్టం అంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్
X
హిట్ సినిమా రీమేకుల్లో నటించడం, మెప్పించడం కత్తి మీద సాము లాంటింది. ఉన్నది ఉన్నట్టు తీసినా, కొత్త సన్నివేశాలు జోడించినా ఒక్కోసారి విమర్శల పాలవుతారు. రీమేక్ చిత్రం తో వేరే భాషలో అడుగుపెట్టడం అంతకి మించిన భారం. ఇలాంటి భారాన్నే ఇప్పుడు టాలీవుడ్ కథానాయకుడు బెల్లంకొండ సాయి మోస్తున్నారు.

ప్రభాస్ ఛత్రపతి రీమేక్ తో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో చిత్ర బృందం షూటింగ్ చేస్తుంది. వి. వి. వినాయక్ ఈ రీమేక్ కి దర్శకుడు.

ఒక ఇంటర్వ్యూ లో, ఈ రీమేక్ కోసం తను పడే కష్టాలను బెల్లంకొండ పంచుకున్నారు. హిందీ డిక్షన్ నేర్చకోవడం పెద్ద కష్టంగా సాయి శ్రీనివాస్ తెలిపాడు. ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఛత్రపతి రీమేక్ ని నిర్మిస్తుంది. ఈ చిత్రం కోసం భారీగా కసరత్తులు చేస్తున్నట్టు బెల్లంకొండ చెప్పాడు .

ఛత్రపతి హిందీ రీమేక్ ఇటీవల జులై లో లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఒరిజినల్ చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళి విచ్చేసి తొలి క్లాప్ కొట్టారు.సినిమా కి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.