Begin typing your search above and press return to search.

నాగ్, చిరుతో పోటీ.. స్వాతిముత్యం ఏమన్నాడంటే?

By:  Tupaki Desk   |   28 Sep 2022 2:30 AM GMT
నాగ్, చిరుతో పోటీ.. స్వాతిముత్యం ఏమన్నాడంటే?
X
దసరా ఫెస్టివల్ ను టార్గెట్ చేస్తూ రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నాగార్జున యాక్షన్ త్రిల్లర్ మూవీ ది ఘోస్ట్ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ యాక్షన్ సినిమా గాడ్ ఫాదర్ అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ రెండు సినిమాల మధ్యలో పోటీ చాలా తీవ్రంగా ఉన్న సమయంలోనే బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం అనే సినిమాతో రాబోతున్నాడు.

రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై చిత్ర యూనిట్ అయితే చాలా నమ్మకంతో ఉన్నట్లు ఇటీవల ప్రమోషన్స్ లో అర్థమవుతుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి అక్కినేని నాగార్జున సినిమాలతో పోటీపై బెల్లంకొండ గణేష్ కూడా తనదైన శైలిలో ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.

ఆ రెండు సినిమాలు కూడా వేటికవే చాలా విభిన్నమైనవి అంటూ నాగార్జున గారిది కంప్లీట్ గా యాక్షన్ మూవీ ఆ తర్వాత మెగాస్టార్ గారిది మరొక పొలిటికల్ డ్రామా.. కాబట్టి మా సినిమా మరొక జానర్ లో డిఫరెంట్ గా ఉండే ఫ్యామిలీ సినిమా. ఎవరు ఊహించలేని ఒక యూనిక్ పాయింట్ కూడా హైలెట్ కాబోతోంది.

అలాంటి సమస్య ఒక ఫ్యామిలీలో వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ సినిమాలో చూస్తే మాత్రం ఈ సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము కామిక్ తరహాలో ఈ కథను చెప్పాము. తప్పకుండా ఆ రెండు పెద్ద సినిమాలతో మా సినిమా భిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. అని నమ్మకంతో ఉన్నాము అని బెల్లంకొండ గణేష్ వివరణ ఇచ్చాడు.

ఇక తన అన్నయ్యను అల్లుడు శ్రీను సినిమాతో భారీ స్థాయిలో లాంచ్ చేసిన మా నాన్నగారు నన్ను కూడా అదే తరహా ప్రేమతోనే చూస్తారు. కానీ నేను ఆ తరహాలో లాంచ్ కావాలని అనుకోలేదు.

నాకంటూ ఒక ప్రత్యేకమైన యూనిక్ పాయింట్ ఉండాలి అని నాకు నేను సొంతంగా ఈ కథను సెలెక్ట్ చేసుకున్నాను. ఎవరు కూడా నాకు బ్యాగ్రౌండ్ లో సపోర్ట్ అయితే చేయలేదు. కేవలం మా నాన్నగారు ఈ సినిమాకు కథ విషయంలో ఒక సలహా మాత్రమే ఇచ్చారు.. అని మిగతాది అంతా కూడా నిర్మాతలు దర్శకుడికి వదిలేసినట్లుగా గణేష్ వివరణ ఇచ్చాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.