ఎట్టకేలకు బెల్లంకొండ 'చత్రపతి' అప్డేట్ వచ్చింది

Mon Jun 14 2021 14:00:01 GMT+0530 (IST)

Bellamkonda 'Chatrapati' update has finally arrived

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2005 సంవత్సరంలో రూపొందిన చత్రపతి సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఆ సినిమాను ఇన్నాళ్ల తర్వాత హిందీలో మన తెలుగు హీరో తో బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియో వారు వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందబోతున్న ఈ రీమేక్ అధికారిక ప్రకటన వచ్చి చాలా నెలలు అయ్యింది. కాని షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ సినిమా చిత్రీకరణ మొదటి నుండి అదుగో ఇదుగో అన్నట్లుగా వాయిదాలు పడుతూ వస్తోంది. దాంతో కొందరు ఈ సినిమా పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఎట్టకేలకు హిందీ చత్రపతిపై క్లారిటీ వచ్చింది. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చకచక జరుగుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఈ సినిమా కోసం భారీ విలేజ్ సెట్టింగ్ ను నిర్వించబోతున్నారు. ఆ సెట్టింగ్ లోనే కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. జులై నెలలో మొదటి షెడ్యూల్ ను అక్కడ నిర్వహిస్తారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇక తదుపరి షెడ్యూల్స్ బెంగళూరు.. ముంబయి మరియు బంగ్లాదేశ్ ల్లో నిర్వహించబోతున్నట్లుగా కూడా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగులో ఇప్పటి వరకు కమర్షియల్ గా బిగెస్ట్ సక్సెస్ అందుకోలేదు. అయినా కూడా ఈయనకు భారీ ఆఫర్ వచ్చింది. ఈ సినిమా సక్సెస్ అయితే హిందీలో ఈయన సెటిల్ అవ్వడం ఖాయం అంటున్నారు. పెద్ద ఎత్తున సినిమా ను రూపొందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఈ సినిమా కోసం ఎంపిక చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.