వీడియో : భగ్న ప్రేమికుడి విరహం

Fri May 24 2019 16:38:24 GMT+0530 (IST)

Bekhayali Song From Kabir Singh

తెలుగులో ఊహించని రీతిలో కల్ట్ క్లాసిక్ గా నిలవడంతో పాటు విజయ్ దేవరకొండకు ఇమేజ్ నిర్మాతకు కమర్షియల్ సక్సెస్ అందించిన అర్జున్ రెడ్డి హింది రీమేక్ కబీర్ సింగ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ భారీ స్పందన దక్కించుకున్న నేపధ్యంలో అంచనాలు పెరుగుతున్నాయి. ఒరిజినల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగానే దీన్ని టేకప్ చేయడం ఎంత తెలివైన నిర్ణయమో పబ్లిసిటీ మెటీరియల్ చూస్తేనే అర్థమైపోతోంది.తాజాగా బెఖయాలి అనే వీడియో సాంగ్ ని రిలీజ్ చేసింది యూనిట్. ప్రేయసి దూరమయ్యాక శూన్యమే జీవితంగా తాగుడే లోకంగా మారిపోయిన ఓ యువ డాక్టర్ వేదనను ఇర్షాద్ కామిల్ అద్భుతమైన సాహిత్యంతో కూర్చగా సాచేత్ పరంపర సంగీతం దాన్ని ఇంకో లెవెల్ కు తీసుకెళ్ళింది. షాహిద్ కపూర్ కీయరా అద్వాని జంటగా చాలా క్యుట్ గా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యారు. పాటను చిత్రీకరించిన విధానం తెలుగు వెర్షన్ నే పోలి ఉన్నప్పటికీ ఆ ఇంటెన్సిటీ ని అలాగే క్యారి చేస్తూ లీడ్ పెయిర్ పాత్రల్లో ఒదిగిపోయిన తీరు చక్కగా ఉంది.

ముఖ్యంగా కొన్ని సెకండ్ల పాటు ఘాడమైన లిప్ లాక్ కిస్ తో మునిగి తేలే షాహిద్ కీయరాల జంట మరోసారి వీడియోను రివైండ్ చేసుకుని చూడాలన్నంత సహజంగా ఉంది. మూడు షేడ్స్ లో షాహిద్ కపూర్ కబీర్ సింగ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన తీరు తెలుగు ప్రేక్షకులను సైతం ఓసారి సినిమా చూద్దాం అనిపించేలా ఉంది. జూన్ 21న విడుదల కానున్న కబీర్ సింగ్ మీద ఇప్పటికే బాలీవుడ్లో ఓ రేంజ్ హైప్ ఉంది. ఇప్పుడీ బెఖయాలి పాట దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళేలా ఉంది. ఆడియోలో ఇదే హై లైట్ సాంగ్ గా మిగిలినా ఆశ్చర్యం లేదు .