బెజవాడ బ్యూటీ బంతాడేసే అందాలతో!

Mon Aug 15 2022 12:08:38 GMT+0530 (IST)

Bejwada Beauty Dimple Hayathi

నేటి జనరేషన్  తెలుగు భామల్లో అంజలి తర్వాత అంతగా ఫేమస్ అవుతున్న బ్యూటీ డింపుల్ హయతి. అమ్మడు పుట్టి పెరిగింది విజయవాడ కావడం సహా తెలుగు అమ్మాయ్? అన్న సాప్ట్ కార్న్ కొంత వరకూ కలిసొచ్చింది.  సాధారణంగా ఇలా అందరికీ జరగదు. కొందరి విషయంలోనే సాధ్యపడుతుంది. ఆ కొందరిలో డింపుల్ ఇంకొంచెం బెటర్ పొజిషన్ లో ఉంది.దానికి కారణం క్రేజీ ప్రాజెక్ట్ లో కొన్ని చెప్పుకోదగ్గ అవకాశాలు అందుకోవడమే. తొలుత   'గల్ఫ్' అనే చిన్న చిత్రంతో ఎంట్రీ ఇచ్చినమ్మడు అటుపై  'దేవి-2'..'అభినేత్రి-2'లో నటించింది.  ఆవెంటనే 'గద్దలకొండ గణేష్' లో స్పెషల్ అప్పీరియన్స్ తో అందాలు దారబోసింది. ఇదే సమయంలో ధనుష్ బాలీవుడ్ సెన్షేషన్ మూవీ 'ఆంట్రగిరి'తో హిందీలోనూ లాంచ్ అయింది.

మందాకిని మాండీ పాత్రలో ఆకట్టుకుంది. దీంతో ఏకంగా మాస్ రాజా రవితేజ తో రొమాన్స్ చేసే ఛాన్స్ అందుకుంది. 'ఖిలాడీ'లో  రాజాతో ఓ రేంజ్  రొమాన్స్ పండించి మరింత  ఫేమస్ అయింది. సినిమా డిజాస్టర్ అయినా డింపుల్ యువతలో హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇప్పుడిదే క్రేజ్ తో మరింత గ్లామర్ డాల్ గా ఫేమస్ అయ్యే ప్రయత్నాలు షురూ చేసింది. ఇన్ స్టా వేదికగా అమ్మడు ఓ రేంజ్ లో సెగలు పుట్టిస్తుంది. రకరకాల భంగిమల్లో ఫోజులిస్తూ యువతని ఆకట్టుకుంటుంది.

ఇటీవలే డింపుల్  బ్రాలెస్ (టాప్ లెస్) లుక్ లో కనిపించింది. టాప్ లెస్ గా కనిపించినా కానీ దానిని బ్లాక్ కోట్ తో కవరప్ చేసింది.  ఈ ఫోటోషూట్ అభిమానుల్లో వైరల్ గా మారింది. ఇంకా ఆ వేడి చల్లారక ముందే తాజాగా మరో టెంప్టింగ్ ఫోటో తో ముందుకొచ్చేసింది.

లావిష్ బ్లూ వైబ్రెంట్ లుక్ లో బ్యూటీ హాట్ పంచ్ కి ప్లాట్ అవ్వాల్సిందే. అమ్మడి కిల్లర్ లుక్ అంతే  కవ్వింపు తో కట్టిపడేస్తుంది.  ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్  గా మారింది. అమ్మడి ఇన్ స్టా ఫాలోవర్స్ హాట్ కామెంట్ల తో మరింత హీటెక్కిస్తున్నారు.