మీనాక్షి బ్యూటీ అంతా అందులోనే దాగుందే!

Tue Aug 16 2022 07:00:01 GMT+0530 (IST)

Beauty of Meenakshi Chaudhary is hidden

'ఇచట వాహనములు నిలుపరాదు' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి టాలీవుడ్ కి సుపరిచితమే. తొలి సినిమాతోనే యావరేజ్ సక్సెస్ అందుకుంది. ఆవెంటనే  మాస్ రాజా రవితేజ సరసన 'ఖిలాడీ'లో ఛాన్స్ అందుకుంది. దీంతో అమ్మడు గ్లామర్ ఎలివేషన్ లో ఒక్కసారిగా  విశ్వరూపం చూపించింది.
 
రాజాతో రొమాన్స్..చిట్టిపొట్టి దుస్తుల్లో హాట్ పెర్పార్మెన్స్ తో ఆకట్టుకుంది. మరో ఛాన్స్ వస్తుందో?  రాదో? అవకాశం ఉన్నప్పుడే దున్నేయాలి అన్న తీరున 'ఖిలాడీ' లో ఓ రేంజ్ లో చెలరేగింది. కానీ ఆ శ్రమంతా  బూడిదలో పోసిన పన్నీరే అయింది. సినిమా ప్లాప్ అవ్వడం..అందులోనూ అమ్మడి పాత్రకి నటనకు ఆస్కారం లేకపోవడంతో తేలిపోయింది.తొలి సినిమాతో సాధించిన ఇంప్రెషన్ చెడింది . త్రివిక్రమ్ లాంటి ఉడంద్దుల నోట ప్రశంసలందుకున్నా..'ఖిలాడీ' ఫలితం శూన్యం వైపు కి తోసేసింది. ప్రస్తుతం యువతలో అటెన్షన్ కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. హాట్  ఫోటోలతో హాట్ టాపిక్ గా నిలుస్తుంది . ఇన్ స్టా వేదికగా  టెంప్టింగ్ ఫోటోలతో మంటలు రేపుతోంది.

తాజాగా మరోసారి అలాంటి ప్రయత్నంతో నెటి జనులు ముందుకొచ్చేసింది. పసుపు వర్ణం మిరుమిట్లు గొలిపే షూట్ లో తళు క్కున మెరిసింది. పింక్ కలర్ బ్లౌజ్ లో స్కిన్ షోని హైలైట్ చేసింది. ముఖానికి  హెవీ మ్యాకప్  అందమైన నవ్వు బ్యూటీకి మరింత వన్నె తీసుకొచ్చింది.

బ్యాక్ డ్రాప్ అమ్మడి ప్లోరల్ డ్రెస్ కి మరింత బ్యూటీని జోడించింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైర్ గా మారింది. అమ్మడి అందాలు ఆస్వాదించడం అభిమానుల వంత్తైంది.

బ్యూటీ అందంలోనే కాదండోయ్..చదవులోనూ అంతే ముందుంటుంది. ఇటీవలే ఈ 25 ఏళ్ల బ్యూటీ  డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని కూడా పూర్తి చేసింది. కానీ డాక్టర్ కాకుండా యాక్టర్ అవ్వాలని మ్యాకప్ వేసుకుని ఇటువైపు వచ్చేసింది. ప్రస్తుతం ఈభామ 'హిట్ ది సెకెండ్ కేస్' లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే 'కోలై 'అనే  సినిమాతో కోలీవుడ్ లోనూ లాంచ్ అవుతోంది.