ట్రైలర్ టాక్: బోల్డ్ గా ఉన్న బ్యూటిఫుల్

Wed Oct 09 2019 16:08:10 GMT+0530 (IST)

Beautiful Movie Trailer

పార్ధ్ సూరి.. నైనా గంగూలి హీరో హీరోయిన్లుగా అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బ్యూటిఫుల్'.  'యాన్ ఓడ్ టు రంగీలా'(రంగీలా చిత్రానికి నీరాజనం).. 'రామ్ గోపాల్ వర్మ డ్రీమ్' గా ఈ సినిమాను ప్రమోట్ చేస్తుండడం అందరినీ ఆకర్షిస్తోంది.  టైగర్/ కంపెనీ బ్యానర్లపై నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజే రిలీజ్ చేశారు.వర్మ శిష్యుడు కాబట్టి వర్మ ట్రైలర్ వర్మ స్టైల్లోనే ఉంది. డైలాగ్స్ లేకుండా బ్యూటిఫుల్ విజువల్స్ తో..  హీరో హీరోయిన్ ల రొమాన్సుతో ట్రైలర్ హాటుగా ఉంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉంది.  బీచ్ లో హత్తుకోవడం... ఎత్తుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం.. నీటిలో మునగడం.. అన్నీ రొమాంటిక్కే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆ బోల్డ్ షాట్స్ కు తగ్గట్టు ఇంట్రెస్టింగ్ గా ఉంది.  హీరో హీరోయిన్లు ఇద్దరూ పేదవారు.  హీరో ఓ మెకానిక్.  "వారు పేదవారు & పిచ్చిగా ప్రేమించుకున్నారు" అని ఒక స్లైడ్..  "అయితే ఒక్క విషయంలో తేడా కొట్టింది".. "ఆమె ధనికురాలిగా మారింది" అంటూ మరో రెండు స్లైడ్స్ చూపించారు.  దీంతో ఇద్దరి లవ్వుకు కొత్తగా అంతస్తు అనేది అడ్డంకిగా మారిందని చూపించారు.  "డబ్బు ఎప్పుడూ అందంగా ఉండదు" అంటూ మరో స్లైడ్ కూడా చూపించారు. ట్రైలర్ చూస్తుంటే 'రంగీలా' సినిమానే కాస్త మార్చి తీసినట్టుగా అనిపిస్తోంది.

కొన్ని ట్రైలర్లు చూస్తే మాటలు రావు.  ఏం చెప్పాలో అర్థం కాదు. ఎందుకనేది తెలియదు.  ఇదో మూగ భాష. మనసుపడే వేదన.  ఈ ట్రైలర్లోనే మాటలు లేవు కాబట్టి అలా అనిపిస్తోందేమో! సో మీరు ఓ మూడు నిముషాలు మౌనంగా ట్రైలర్ ను చూసేయండి.