వీడియో : వెండితెర బుల్లితెర సూపర్ స్టార్స్ సాహస యాత్ర

Sat Jun 25 2022 17:21:38 GMT+0530 (IST)

Bear Gryll Adventure with Bollywood Hero

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుని బుల్లి తెర సూపర్ హీరో.. స్టార్ హీరో అన్నట్లుగా పేరు దక్కించుకున్న సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ కొత్త ఎపిసోడ్ ను బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో చేశాడు. అత్యంత కఠిన పరిస్థితుల్లో రణ్వీర్ సింగ్ బేర్ గ్రిల్స్ తో కలిసి సాహస యాత్ర ను సాగించాడు.సహజంగా హీరోలు అంటే భారీ యాక్షన్ సన్నివేశాలకు సైతం డూప్స్ ను వినియోగిస్తూ ఉంటారు. కాని రణ్వీర్‌సింగ్ మాత్రం అత్యంత కఠోరమైన సాహసాలను బేర్ గ్రిల్స్ తో కలిసి చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. బేర్ గ్రిల్స్ కు వైల్డ్ లైఫ్ అలవాటు. కాని రణ్ వీర్ చాలా కష్టపడ్డాయి. ఒకానొక సమయంలో తన వల్ల కాదు అన్నట్లుగా ట్రైలర్ లో చూడవచ్చు.

నెట్ ఫ్లిక్స్ లో అతి త్వరలో స్ట్రీమింగ్ అవ్వబోతున్న బేర్ గ్రిల్స్ మరియు రణ్వీర్ సింగ్ ల యొక్క మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంకు సంబంధించిన ట్రైలర్ రావడంతో ప్రస్తుతం అది కాస్త వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో రణ్వీర్ సింగ్ అభిమానులతో పాటు బేర్ గ్రిల్స్ అభిమానులు వీడియోను మరియు అందులోని షాట్స్ ను షేర్ చేసుకుంటూ చర్చించుకుంటున్నారు.

గతంలో పలువురు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ స్టార్స్ ను బేర్ గ్రిల్స్ వైల్డ్ లైఫ్ లోకి తీసుకు వెళ్లి వారికి కొత్త అనుభవం ను ఇవ్వడంతో పాటు ప్రేక్షకులకు కన్నుల విందు చేశాడు.

ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో బేర్ గ్రిల్స్ చేసిన సాహస యాత్రకు ఇండియాలో మంచి రేటింగ్ దక్కింది. మళ్లీ ఇప్పుడు రణ్వీర్ సింగ్ తో చేసిన ఈ షో కు మంచి రేటింగ్ వస్తుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉన్న బేర్ గ్రిల్స్ తో చాలా మంది స్టార్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో ను చేయాలని కోరుకుంటున్నారు. ఆయన మాత్రం అతి కొద్ది మంది స్టార్స్ తో ఈ సాహస యాత్ర చేస్తున్నారు. హెలికాప్టర్ లో అత్యంత దట్టమైన అడవికి వెళ్లి.. అక్కడ చాలా సాహసోపేత యాత్రను నిర్వహించిన రణ్వీర్ సింగ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.