Begin typing your search above and press return to search.

NTR 30 హైరేంజ్​లో బీచ్​ ఫైట్​​..

By:  Tupaki Desk   |   7 Feb 2023 6:00 PM GMT
NTR 30 హైరేంజ్​లో బీచ్​ ఫైట్​​..
X
హీరో ఎన్టీఆర్‌.. దర్శకుడు కొరటాల శివ కలయికలో NTR 30 పేరుతో ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్‌ వంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది. మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా పూర్వ నిర్మాణ పనుల్ని పూర్తి చేసుుకున్న ఈ సినిమా ఈ నెలలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. అసలే అప్డేట్స్​ అప్డేట్స్​ అంటూ చాలా కాలంగా రచ్చ చేస్తున్న అభిమానులకు ఉత్సాహాన్ని వార్త ఒకటి తాజాగా బయటకు వచ్చింది.

బీచ్​ సెటప్​ వేసి ఓ హెవీ యాక్షన్​ సీక్వెన్స్​ను రూపొందించనున్నారట. చిత్రానికే ఇదే మెయిన్​ హైలైట్​గా నిలవనుందట. కొరటాల దీన్ని ఎలా తెరకెక్కిస్తున్నారంటే... ఇది చూసినప్పుడు ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయమని అంటున్నారు. సినిమాలో ఈ బీచ్ యాక్షన్​ సీక్వెన్స్​ చిత్రానికి కీలకం కానుందట. కథలో ఇక్కడి సన్నివేశాలే ముఖ్యమట. ​ఇందుకోసం భారీ సెటప్​ వేయబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఎన్టీఆర్‌ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని మెప్పించేలా ఓ శక్తిమంతమైన కథతో ఈ చిత్రం రూపొందనుంది. అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

కాగా, నిజానికి కొరటాల శివ, ఎన్టీఆర్‌ ఈ సినిమా ప్రకటించాక సైలెంట్‌గా ఉండిపాయారు. ఇక దీని గురించి ఎలాంటి అప్‌డేట లేకపోవడంతో ఈ మూవీ సెట్స్‌పై వెళ్లుందా? లేదా? అనే అనుమానాలు వెల్లుత్తాయి. అప్పటి నుంచి ఫ్యాన్స్ అప్డేట్స్​ అంటూ సోషల్​మీడియా వేదికగా రచ్చ రచ్చ చేశారు. దీంతో ఇటీవలే కల్యాణ్ రామ్​ ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు గెస్ట్ గా వెళ్లిన ఎన్టీఆర్​ ఫుల్​ సీరియస్ అయిపోయారు. ఒకానొక సందర్భంలో యాంకర్ సుమను కూడా చాలా కోపంగా చూస్తూ కనిపించారు. అభిమానులకైతే ఫుల్ క్లాస్​ పీకారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కళ్యాణ్​ రామ్​.. ఎన్టీఆర్​ను సముదాయించేందుకు ప్రయత్నించగా.. ఎన్టీఆర్​ కాస్త స్థిమిత పడ్డారు.

ఎన్టీఆర్ 30 అప్డేట్ అనే కాదు ఏ హీరో సినిమా అప్డేట్ అయినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమే బయట పెడతాం. అలా అన్ని సార్లు అడిగితే దర్శక నిర్మాతల మీద ఒత్తిడి పడుతుంది. దయచేసి ఈ విషయంలో అర్థం చేసుకోండి. అప్డేట్​ విషయాల్లో మాకు మా కుటుంబ సభ్యుల కన్నా అభిమానులే ఎక్కువ. మా భార్యల కన్నా ముందే మీకే చెబుతాం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్​ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. సినిమా అనుకున్న తేదీకే వచ్చే ఏడాది ఏప్రిల్​ 5న రిలీజ్ అవుతుందని స్పష్టతనిచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.