Begin typing your search above and press return to search.

పరశురామ్ చేతుల మీదుగా విడుదలైన 'బ‌తుకు బ‌స్టాండ్' ట్రైల‌ర్..!

By:  Tupaki Desk   |   23 July 2021 10:53 AM GMT
పరశురామ్ చేతుల మీదుగా విడుదలైన బ‌తుకు బ‌స్టాండ్ ట్రైల‌ర్..!
X
అల్లు అర్జున్ మేనమామ కొడుకు విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న చిత్రం ''బతుకు బస్టాండ్''. ఐఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిఖిత అరోరా - శృతి శెట్టి - జెన్నిఫర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బ్రెజిలియ‌న్ మోడ‌ల్ జెన్నీఫ‌ర్ పిక్కినాటో స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. చక్రధర్ రెడ్డి సమర్పణలో ఇలవల ఫిలిమ్స్ బ్యానర్ పై ఐ.కవితా రెడ్డి - కె.మాధవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు ఇటు ఇండ‌స్ట్రీ సర్కిల్స్ లో ఈ చిత్రంపై ఆస‌క్తి పెరుగుతూ వచ్చింది. అలానే ఈ సినిమాకు సంబంధించిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు కూడా సోష‌ల్ మీడియాలో అనూహ్య స్పంద‌న లభించింది.

''బతుకు బస్టాండ్'' ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ తో పాటుగా ఇటీవ‌లే విడుద‌లైన రెండు పాట‌లలు యూట్యూబ్ లో విశేషాద‌ర‌ణ దక్కించుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా సినిమా ట్రైల‌ర్ ను 'సర్కారు వారి పాట' దర్శకుడు పరాశురామ్ పెట్లా లాంచ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు. బస్టాండ్ లో కూర్చొని విరాన్ పెద్దగా అవడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. విరాన్ తన తొలి సినిమాతోనే తనలోని రొమాంటిక్ అండ్ మాస్ యాంగిల్ ని కూడా బయటపెడుతున్నాడు. హీరో ఎవరి కోసమో వెతకడం.. ఈ క్రమంలో విలన్స్ తో పోరాడటం వంటి సన్నివేశాలతో ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా సస్పెన్స్ గా సాగింది.

'మౌనంగా ఉన్నానని ముని అనుకుంటున్నవేమో.. నాలో ఒక విశ్వామిత్రుడు కూడా ఉండి ఉండొచ్చు' అని విరాన్ చెబుతున్నాడు. చివర్లో నా చావుకు కారణం మా అమ్మానాన్నలు అని హీరో సూసైడ్ లెటర్ రాస్తుండటంతో అసలు ఈ సినిమా కథ ఎంటనే ఆసక్తి కలుగుతుంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ మహవీర్ అందించిన నేపథ్య సంగీతం.. వాస్ కమల్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఈ సినిమాలో ఎవరి బతుకు బస్టాండ్ అయిందనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఈ సినిమా ట్రైలర్ కు సోష‌ల్ మీడియాతో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ వస్తోందని చిత్ర ద‌ర్శ‌కుడు ఐ.ఎన్. రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. కంటెంట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఆడియెన్స్ కి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్ పీరియ‌న్స్ ఇచ్చే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించిన‌ట్లుగా నిర్మాత‌లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశామని.. త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేశామని చిత్ర నిర్మాత‌లు తెలిపారు. అల్లు ఫ్యామిలీ అండతో ఇండస్ట్రీలోకి వస్తున్న విరాన్ కు 'బ‌తుకు బస్టాండ్' సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.