Begin typing your search above and press return to search.

త్వరలో తమిళ ప్రేక్షకులను అలరించనున్న బెంగళూరు భామ!

By:  Tupaki Desk   |   3 Aug 2021 10:30 AM GMT
త్వరలో తమిళ ప్రేక్షకులను అలరించనున్న బెంగళూరు భామ!
X
అల్లుడు అదుర్స్ భామ నభానటేష్‌, బాలీవుడ్ కండల వీరుడు హ్రితిక్ రోషన్ సరసన ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. ఒక ఇంగ్లీష్ సిరీస్ దీనికి మాతృక అని, దర్శక నిర్మాతలు నభానటేష్‌ వైపే మొగ్గు చూపుతున్నారని, అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందని తెలిసింది.

గ్రీక్ గాడ్ గా పేరొందిన హీరో సరసన గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందని అందరూ అనుకుంటున్న వేళ, నభానటేష్‌ మరో బంఫర్ ఆఫర్ చేజిక్కించుకున్నట్టు సమాచారం. ఒక పెద్ద నిర్మాణ సంస్థ రోపొందించే తమిళ సినిమా కోసం బెంగుళూరు భామని సంప్రదించినట్టు, నభానటేష్‌ ఇందుకు అంగీకరించినట్టు సమాచారం.

నభానటేష్‌ నటించే తొలి తమిళ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. చిత్ర దర్శకుడి పేరు, నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన ప్రకటన, నిర్మాణ సంస్థ నుంచి వచ్చే అవకాశం ఉంది.

ఓటీటీ లకి పెరిగిన ఆదరణ దృష్ట్యా, ప్రముఖ తారలు కూడా వీటి వైపు అడుగులేస్తున్నారు. సమంత, తమన్నా, కాజల్ లాంటి తారలు ఓటీటీల్లో కూడా తమ సత్తా చాటి అందరి చేతా ప్రసంశలు అందుకున్నారు. నభా కూడా ఆ జాబితాలో చేరుతుందో లేదో చూడాలి.

కన్నడ చిత్రం వజ్రకాయ తో నటన వైపు అడుగులేసింది ఈ కన్నడ కస్తూరి, సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' తో టాలీవూడ్ లో ప్రవేశించింది. ఇస్మార్ట్ శంకర్ తో ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది నభా.