Begin typing your search above and press return to search.

బండ్ల‌న్న సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడా?

By:  Tupaki Desk   |   3 Oct 2022 10:30 AM GMT
బండ్ల‌న్న సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడా?
X
బండ్ల గ‌ణేష్ ఏం మాట్లాడినా సెన్సేష‌నే అవుతూ వంటుంది. ఆ మ‌ధ్య కాంగ్రెస్ పార్టీలో చేరి మీడియా కు వ‌రుస ఇండ‌ర్వ్యూలు, లైవ్ డిబేట్ ల‌లో పాల్గొని స్టేట్‌మెంట్ లు పాస్ చేసి న‌వ్వులు పూయించిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే సెవెనో క్లాక్ బ్లేడ్ తో పీక కోసుకుంటా అంటూ బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న స్టేట్ మెంట్ ఇవ్వ‌డం.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్ త‌రువాత అన్నా సెవెనో క్లాక్ బ్లేడ్ తో ఎక్క‌డికి ర‌మ్మంటావ్ అంటూ ట్రోల్ చేయ‌డం తెలిసిందే.

ఇప్ప‌డు ఇదే త‌ర‌హాలో బండ్ల గ‌ణేష్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడ‌టంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు గుప్పుమంటున్నాయి. త‌న లూస్ టాక్ తో బండ్ల‌న్న సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడా? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం గుస గుస‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూతో బండ్ల గ‌ణేష్ మ‌ళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. పూరి జ‌గ‌న్నాథ్ పై ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన బండ్ల గ‌ణేష్ తాజాగా స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ పై చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మేన‌ని అంగీక‌రించి షాకిచ్చాడు.

ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ పై బండ్ల గ‌ణేష్ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఓ ఆడియో టేప్ నెట్టింట వైర‌ల్ గా మారి తీవ్ర చ‌ర్చినీయాంశం అయిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన బండ్ల గ‌ణేష్ ఆ వాయిస్ త‌న‌ది కాద‌ని, ఎవ‌రో మిమిక్రీ చేశార‌ని బుకాయించాడు. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ మాత్రం ఆ గొంతు త‌న‌దేన‌ని, ఎందుకు తిట్టావ్ అని అడిగితే మ‌నిష‌న్నాక కోపం రాదా? అని ఎదురు స‌మాధానం చెప్ప‌డం ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది.

'భీమ్లానాయ‌క్‌' సినిమా స‌మ‌యంలో త్రివిక్ర‌మ్ ని బండ్ల గ‌ణేష్ తిడుతున్న ఆడియో ఒక‌టి బ‌య‌టికి రావ‌డం, సోష‌ల్ మీడియాలో సంచ‌నం సృష్టించ‌డం తెలిసిందే. దీనిపై తాజాగా వివ‌ర‌ణ ఇచ్చాడు బండ్ల గ‌ణేష్‌. త‌న‌ని తిట్టిన మాట వాస్త‌మే న‌ని అందుకు అత‌నికి సారీ కూడా చెప్పాన‌ని అన్నాడు. ఈ మాట‌లు విన్న ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు మాత్రం ఇలా లూజ్ టాక్ వ‌ల్ల బండ్ల గ‌ణేష్ క్రెడిబిలిటీని పోగొట్టుకుంటున్నాడ‌ని, త‌న యాటిట్యూడ్ కార‌ణంగా త‌న‌కు తానే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడ‌ని వాపోతున్నార‌ట‌.

మాట పొదుపుగా వాడితే మంచిద‌ని లేకుండా నిర్మాత‌గా అత‌ని కెరీర్ కె పెద్ద దెబ్బ త‌గిలే అవ‌కాశం వుంద‌ని ప‌లువురు హెచ్చ‌రిస్తున్నార‌ట‌. మ‌రి బండ్ల‌న్న వీరి మాట‌లు వింటాడా? .. ఇదే వైఖ‌రిని కొన‌సాగించి మ‌ళ్లీ మ‌ళ్లీ వార్త‌ల్లో నిల‌వాల‌ని కోరుకుంటాడో వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.