Begin typing your search above and press return to search.

బండ్ల బాబు ఏంటీ నీ గొడవ?

By:  Tupaki Desk   |   23 Jan 2020 5:30 PM GMT
బండ్ల బాబు ఏంటీ నీ గొడవ?
X
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంకు మిశ్రమ స్పందన వచ్చింది. కలెక్షన్స్‌ భారీగా వస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించగా కొందరు సోషల్‌ మీడియా జనాలు మాత్రం వాటిని ఫేక్‌ అంటూ కొట్టి పారేస్తున్నారు. సోషల్‌ మీడియాలో మహేష్‌ బాబు తమ హీరో సినిమాపై కామెంట్స్‌ చేస్తున్న వారిపై ఎదురు దాడి చేస్తున్న సమయంలో బండ్ల గణేష్‌ ఈ సమయంలో సరిలేరు నీకెవ్వరు చిత్ర దర్శకుడు అనీల్‌ రావిపూడిపై ఆరోపణలు చేస్తూ తనకు అన్యాయం జరిగింది అంటూ మీడియా ముందుకు వచ్చాడు.

సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బండ్ల గణేష్‌ చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో వచ్చే కీలకమైన ట్రైన్‌ ఎపిసోడ్‌ లో దొంగగా బండ్ల గణేష్‌ కనిపించిన విషయం తెల్సిందే. అయితే తన పాత్రను చాలా కట్‌ చేశారని.. అసలు ఒక ఆరంభం లేకుండా సడెన్‌ గా చూపించడంతో ప్రేక్షకులకు తన పాత్ర ఏమాత్రం కనెక్ట్‌ అవ్వలేదని.. తన పాత్రకు పరిచయ సీన్‌ ఉంటుంది. ఆ సీన్‌ లేకుండా డైరెక్ట్‌ గా చూపించడంతో తన పాత్రకు అర్థం లేకుండా పోయిందని.. అసలు సినిమాలో నా పాత్ర తీసేసినా బాగుండేది కాని ఇలా మద్యలో తెచ్చి అర్థం పర్థం లేకుండా తన పాత్రను చూపించాడు అంటూ దర్శకుడు అనీల్‌ రావిపూడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం సినిమా కలెక్షన్స్‌ గురించి కొందరు విమర్శలు చేస్తున్న సమయంలో బండ్ల గణేష్‌ ఇలా దర్శకుడు అనీల్‌ పై విమర్శలు చేయడం సినిమాకు నష్టం చేకూర్చుతుందని మహేష్‌ బాబు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమెడియన్స్‌ పాత్రలను సినిమా నిడివిని బట్టి ఉంచుతారు తప్ప కథలో భాగం కాని నీవు చేసిన పాత్రలను ఎక్కువ నిడివి ఎందుకు ఉంచుతారు. నీ పాత్ర సినిమాకు ఎంత వరకు అవసరమో అంతే ఉంచుతారు. నీ గొడవ ఆపేయమంటూ అభిమానులు బండ్ల గణేష్‌ కు సూచిస్తున్నారు.