బండ్లగణేష్ నిర్మాణంలో ఆధ్యాత్మిక గురు బయోపిక్

Sun Oct 24 2021 16:42:54 GMT+0530 (IST)

Bandla Ganesh Planning Spiritual Guru biopic

నటుడిగా పాపులారిటీ సంపాదించిన తర్వాత బండ్ల గణేష్ నిర్మాణ రంగంలోకి దిగాడు. గబ్బర్ సింగ్ బాద్ షా టెంపర్ వంటి విజయాలను అందించడం ద్వారా టాలీవుడ్ లో విజయవంతమైన నిర్మాతగా నిరూపించుకున్నాడు. రాజకీయాలపై దృష్టి సారించేందుకు కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు.తన రాజకీయ జీవితం సరిగ్గా సాగకపోవడంతో గణేష్ మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. గత సంవత్సరం బండ్ల గణేష్ ‘సరిలేరు నీకెవ్వరు’లో చిన్న పాత్రలో నటించడం ద్వారా తిరిగి మెప్పించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్వరలో ఓ సినిమా చేస్తానని కొద్ది నెలల క్రితమే ప్రకటించాడు. తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు.

ఆధ్యాత్మిక గురువు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీవితంపై బయోపిక్ తీయనున్నట్టు బండ్ల గణేష్ ప్రకటించారు. గణేష్ సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అతను స్వామితో ఉన్న చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. “నేను అప్పాజీ జీవిత చరిత్ర సినిమా మాత్రమే తీస్తాను. ఆయనపై సినిమా చేయడానికి అనుమతించాడు. ఎవరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు ’అని సచ్చిదానందతోపాటు దిగిన ఫొటో గణేష్ ట్వీట్ చేశారు.

మరి ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో సచ్చిదానంద స్వామి పాత్రను ఎవరు పోషిస్తారో చూడాలి. ఈ సినిమా గురించి బండ్ల గణేష్ మరిన్ని అప్‌డేట్స్ చెప్పేవరకూ వేచి చూడాల్సూిందే.

ఇదిలా ఉండగా.. బండ్ల గణేష్ ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటిస్తున్న డేగల బాబ్జీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.