Begin typing your search above and press return to search.

నాన్న‌ మాట వింటే బాబి అవుతారు.. విన‌క‌పోతే బ‌న్నీ అవుతారు!

By:  Tupaki Desk   |   5 Dec 2022 4:14 AM GMT
నాన్న‌ మాట వింటే బాబి అవుతారు.. విన‌క‌పోతే బ‌న్నీ అవుతారు!
X
బండ్ల గ‌ణేష్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. న‌టుడు- నిర్మాత‌- నాయ‌కుడు-వ‌క్త ఇలా ఎన్ని కోణాల్లో అయినా అభివ‌ర్ణించవ‌చ్చు. వీట‌న్నిటినీ మించి ప‌బ్లిక్ త‌న‌ను మ‌ర్చిపోకుండా నిరంత‌రం వార్త‌ల్లో నిల‌వ‌డం ఎలానో బండ్ల‌ను చూసి కూడా నేర్చుకోవ‌చ్చు.

ఇంత‌కుముందు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా అంటూ బండ్ల చేసిన హంగామా.. క్రియేట్ చేసిన హ్యూమ‌ర్ గురించి ఎప్ప‌టికీ అభిమానులు చ‌ర్చించుకుంటూనే ఉన్నారు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ ని దేవుడిగా పూజించే వీరాభిమానిగా.. మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రాణ‌ప్ర‌దంగా భావించే మెగాభిమానిగా అత‌డిని చూస్తున్నాం.

ఇప్పుడు అల్లు బ్ర‌ద‌ర్స్ పైనా అతడి అభిమానం చూశాక అభిమానులు ''బండ్లా నీ బొంద‌బ‌డా.. ఏమిట‌యా నీ ఛ‌మత్కారం?'' అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు. అత‌డిలోని ఫ‌న్నీ టింజ్ ని ఎలివేట్ చేస్తున్న ఈ వీడియో అంత‌ర్జాలంలోను చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇంత‌కీ బండ్ల అంత కామెడీ ఏం చేశాడు? అంటే..!

తండ్రి మాట విని బాబీలా అవుతారా? తండ్రి మాట విన‌ని బ‌న్నీలా అవుతారా? మీరే నిర్ణ‌యించుకోండి! అంటూ అత‌డు విసిరిన ఛ‌మ‌క్కు అల్లు ఫ్యాన్స్ కి ఎక్క‌డో గుచ్చుకుంద‌ని చెప్పాలి. తండ్రి మాట విన‌క‌పోతే సూప‌ర్ స్టార్ బ‌న్నీ అవుతారు. తండ్రి చెప్పిందల్లా వింటే బాబీలా బుద్ధిమంతుడిగా మాత్ర‌మే మిగిలిపోతారు... అని బండ్ల చాలా చ‌క్క‌గా వ‌ర్ణించాడు. అత‌డిలోని ఫ‌న్ టింజ్ కి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్ర‌మే. బండ్ల ఇచ్చిన‌ది కాంప్లిమెంటా లేకపోతే గాలి తీసేయ‌డ‌మా? అంటూ బాబీ ఇంకా ఇప్ప‌టికీ క‌న్ఫ్యూజ‌న్ లోనే ఉండి ఉండొచ్చ‌ని అల్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ - చిరంజీవిపై బండ్ల ప్రేమ గురించి మెగాభిమానులంతా చ‌ర్చించుకుంటారు. తాజా పొగ‌డ్త‌ల‌తో అల్లు అర‌వింద్ ఆయ‌న ఫ్యామిలీ హీరోల‌పైనా అత‌డికి ఉన్న ప్రేమ బ‌య‌ట‌ప‌డింది. దీనిపైనా మెగా- అల్లు ఫ్యాన్స్ లో చ‌ర్చ షురూ! ఇంత‌కీ బండ్ల ఈ వ్యాఖ్య‌లు ఎక్క‌డ చేశారు? అంటే.. ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు గుణశేఖర్ కుమార్తె వివాహానికి బండ్ల గణేష్ హాజరయ్యారు. వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా.. బండ్ల గణేష్ అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీతో క‌లిసి క‌నిపించారు. అంతేకాదు... బాబీని... బన్నీని అత‌డు పోల్చిన తీరు బోలెడంత హ్యూమ‌ర‌సం పంచింది వీక్ష‌కుల‌కు. ప్ర‌స్తుతం ఈ మొబైల్ వీడియో క్లిప్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

బాబీ విదేశాలకు వెళ్లి తన చదువు కొనసాగించాడని అత‌డు ఉన్న‌త‌ విద్యావంతుడని తన తండ్రి నిర్మాత అల్లు అరవింద్ కు విధేయుడిగా ఉండేవాడ‌ని కూడా బండ్ల చెప్పిన తీరు ఆక‌ట్టుకుంది. అంతేకాదు అల్లు అర్జున్ తన తండ్రిని పట్టించుకోలేదని కూడా అత‌డు ఫ‌న్ ని క్రియేట్ చేసాడు. అందువ‌ల్ల‌నే బ‌న్నీ నేడు పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడని గణేష్ పొగిడేశారు. ఇక‌పై మీరు బ‌న్నీగా ఉంటారా? బాబి అవుతారా? అన్న‌ది కూడా నిర్ణ‌యించుకోవాల‌ని యూత్ కి డెడ్ లైన్ పెట్టాడు బండ్ల‌. ఇంత‌కీ బండ్ల సూచించిన‌ట్టు తండ్రి మాట‌ను పెడ‌చెవిన పెట్టి సూప‌ర్ స్టార్ అవ్వాల‌నుకుంటున్నారా మీరు? అన్న‌ట్టు సినిమాలేవీ తీయ‌కుండా ఇలా ఇంకా ఎన్నాళ్లు మీడియా ముందు చెణుకులు కొటేష‌న్ల‌తో గ‌డిపేస్తాడు బండ్ల‌? అన్న‌ది కూడా వేచి చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.