Begin typing your search above and press return to search.

ఫుల్ స్వింగ్ లో బండ్ల గణేష్..!

By:  Tupaki Desk   |   22 Oct 2021 12:05 PM GMT
ఫుల్ స్వింగ్ లో బండ్ల గణేష్..!
X
హాస్యనటుడుగా పేరు తెచ్చుకొని, ఆపై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గానూ రాణించిన బండ్ల గణేశ్.. ఇప్పుడు హీరో అవతారమెత్తుతున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్ర దర్శకత్వంలో బండ్ల హీరోగా ''డేగల బాబ్జీ'' అనే సినిమా తెరకెక్కుతోంది. యశ్ రుషి బ్యానర్ పై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'డేగల బాబ్జీ' సినిమాలోని బండ్ల గణేష్ ఫస్ట్ లుక్.. ఇతర ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ను బండ్ల సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నట్టు ట్వీట్ ద్వారా తెలిపారు.

డబ్బింగ్ రూమ్ లోని మేనిటర్ లో తన విజువల్ రివీలయ్యే ఒక ఫోటోని బండ్ల గణేష్ పోస్ట్ చేశారు. ఇదొక డిఫరెంట్ ఫిల్మ్ అని.. అందరి బ్లెస్సింగ్స్ కావాలని ట్వీట్ లో పేర్కొన్నారు. బండ్ల గణేష్ హీరోగా చేస్తున్న సినిమా మంచి విజయం సాధించాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

'డేగల బాబ్జీ' సినిమా తమిళంలో ఘన విజయం సాధించిన 'ఒత్త సెరుప్పు సైజ్ 7' (ఒక్కటే చెప్పు సైజ్ 7) చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. పార్థీబన్ ప్రధాన పాత్రలో ఆయన దర్శక నిర్మాణంలోనే రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. అలానే పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. ఈ సినిమా ఒక్క పాత్రతోనే రూపొందడం విశేషం. ఈ సినిమా ఇప్పుడు తెలుగు హిందీలతో పాటుగా పలు భాషల్లో రీమేక్ అవుతోంది. మరి 'డేగల బాబ్జీ' సినిమా బండ్ల గణేశ్ కు హీరోగా ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.