Begin typing your search above and press return to search.

భీమ్లా ఈవెంట్ కి రాకుండా బండ్ల‌పై కుట్ర లీక్!

By:  Tupaki Desk   |   22 May 2022 4:54 AM GMT
భీమ్లా ఈవెంట్ కి రాకుండా బండ్ల‌పై కుట్ర లీక్!
X
ఇది త్రోబ్యాక్ (గ‌తించిన‌) సంగ‌తి అయినా కానీ ఇప్పుడు ఇలా బ‌హిరంగ వేదిక సాక్షిగా ప‌వ‌న్ అభిమానులంద‌రికీ తెలిసిపోయింది. ఇంత‌కీ ఏమిటా టాప్ సీక్రెట్.. లీకిచ్చిందెవ‌రు? అంటే.. ఇంత‌కుముందు భీమ్లా నాయ‌క్ ఈవెంట్ కి బండ్ల గ‌ణేష్ ని రానివ్వ‌కుండా ఒక షాడో నిలువ‌రించింద‌ట. ఆ షాడో ఎవ‌రో యాంక‌ర్ సుమ ఇప్పుడు ఎఫ్ 3 వేదికపై లీకులివ్వ‌డం క‌ల‌క‌లం రేపింది.

విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ క‌థానాయ‌కులుగా త‌మ‌న్నా - మెహ్రీన్ కథానాయిక‌లుగా నటించిన F3 మే 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది తాజాగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ లీక్ చేసిన ఓ విష‌యం ప్రత్యేకంగా ఆకర్షించింది. తెలంగాణ యాసలో తన అద్భుతమైన పంచ్ లతో ఈవెంట్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించిన సుమ‌.. తనదైన‌ హాస్యాన్ని కొనసాగిస్తూ నిర్మాత బండ్ల గణేష్ పై ఒక పంచ్ విసిరింది. అది వెంటనే సోషల్ మీడియాలో అంతే పెద్ద‌గా పేలింది.

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరుకాకుండా తనను ఒక ప్రముఖ దర్శకుడు ఆపేశాడంటూ బండ్ల గణేష్ వాయిస్ తో కూడిన కాల్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎఫ్3 ఈవెంట్ లో సుమ మాట్లాడుతూ.. భీమ్లా నాయక్ ఈవెంట్ కు బండ్లను రాకుండా ఆపేశారు.

భీమ్లా నాయక్ ఈవెంట్‌కి బండ్ల రాకుండా ఎలా అడ్డుకున్నారో అలాగే నన్ను కూడా ఈవెంట్ కి రాకుండా ఆపేశారు! అంటూ సుమ త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించి అంద‌రినీ న‌వ్వుల్లో ముంచెత్తారు. అయితే సుమ ఇచ్చిన లీకు ప్ర‌కారం బండ్ల‌పై ఈ విష‌యంలో అంత కుట్ర ఉందా? అంటూ ఇప్పుడు మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది.

సెన్సార్ క్లీన్ యు.. అయినా డౌటే!

మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఎఫ్ -3 ఈనెల‌ 27న గ్రాండ్ రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ తో పాటు అన్ని ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుని 2 గంటల 28 నిమిషాల నిడివితో క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాలో తమన్నా భాటియా- మెహ్రీన్ పిర్జాదా- సోనాలి చౌహాన్ కథానాయికలు. అయితే హాట్ అండ్ బోల్డ్ బ్యూటీస్ ని ఎంపిక చేసుకున్న రావిపూడి క్లీన్ యు సినిమా ఎలా తీయ‌గ‌లిగార‌న్న‌ది ఇప్పుడు స‌స్పెన్స్ గా మారింది. ఇది ఎలా పాజిబుల్ అన్నది తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే. అన్నపూర్ణ- ప్రగతి- సునీల్- అలీ- రాజేంద్ర ప్రసాద్ -మురళీ శర్మ త‌దిత‌రులు ఈ కామెడీ సినిమాలో ఇత‌ర‌ తారాగ‌ణం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

21 మే 2022న హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుందని ఇంత‌కుముందే చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ ఈవెంట్ సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రస్తుతానికి గ్రాండ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి ఎవ‌ర‌న్న‌దానిపై ఎలాంటి సమాచారం లేదు.

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఆశ‌ల క‌థ‌లు కిక్కిస్తాయా?

స‌హ‌జంగానే మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం క‌థ‌లు డ‌బ్బు చుట్టూ తిరుగుతాయి. ఏదీ స‌రిగా స‌మ‌కూర‌దు. డ‌బ్బు లేనిదే ఏదీ లేదు! అనుకునే మెంటాలిటీ పుట్టేది మ‌ధ్య‌త‌ర‌గ‌తిలోనే. పేద దిగువ త‌ర‌గ‌తుల్లో ఫీలింగ్స్ ఆలోచ‌న‌ల‌తో పోల్చినా .. ధ‌నిక వ‌ర్గాల ఆలోచ‌న‌ను మైండ్ సెట్ ని ప‌రిశీలించినా అక్క‌డ క‌నిపించ‌నిది మ‌ధ్య‌త‌ర‌గ‌తిలో క‌నిపిస్తుంది. డ‌బ్బు వెంట ప‌డే క్ర‌మంలో బోలెడ‌న్ని ట్విస్టులు ఉంటాయి. ఒడిదుడుకులు ఎత్తు ప‌ల్లాలు క‌ష్టాలు క‌ల్లోలాలు వివాదాలు ఇలా ఇన్నిటినీ యాడ‌ప్ చేయొచ్చు. ఇప్పుడు ఎఫ్ 3లో వీట‌న్నిటినీ అనీల్ రావిపూడి చూపిస్తున్నాడ‌ని టాక్.

ఇది సీక్వెల్ క‌థ కాదు! అని అనీల్ రావిపూడి ఇంత‌కుముందే చెప్పారు. ఎఫ్ 3 క‌థాంశం పూర్తిగా నూత‌నంగా ఉంటుంది. కొత్త టింజ్ తో డ‌బుల్ కామెడీ డ‌బుల్ డోస్ తో ఉంటుంద‌ని వెల్ల‌డించారు. F3 అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం వేసవి సెలవుల సందర్భంగా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. F3 లోనూ కామ‌న్ ఎలిమెంట్ తెలుగు మధ్యతరగతి మహిళలను టార్గెట్ చేయ‌డ‌మేన‌నేది తాజా గుస‌గుస‌. భార్యలు అత్తమామలపై దృష్టి సారించి అనిల్ ముందుగా F2 తో చ‌క్క‌ని ఆహ్లాద‌క‌ర‌మైన కామెడీ అందించి హిట్టు కొట్టాడు.

F3లో అంత‌కుమించి ట్రీటిస్తాడ‌ట‌. అయితే ఈసారి అనిల్ మహిళలను టార్గెట్ చేయ‌డం కంటే.. అందుకు కార‌ణాల‌పై గురి పెట్టాడ‌ట‌. చివరికి ఆడాళ్ల‌కు అనుకూలంగా సందేశం ఇవ్వనున్నాడు. ఎఫ్ 3 మొత్తం కేవలం డబ్బు చుట్టూనే తిరుగుతుందని కథనాలు వస్తున్నాయి. ఆడాళ్ల‌పై సెటైర్లు వేయ‌డం స‌రికాదు కానీ.. దానికి కార‌ణాల‌పై వేస్తే త‌ప్పేమీ లేద‌ని అర్థం చేసుకోవాలి. ఈసారి అనిల్ మధ్యతరగతి డబ్బు మనస్తత్వాన్ని .. ధనవంతులు పేదలను ఎలా దోపిడీ చేస్తారో కూడా తెర‌పై చూపిస్తార‌ట‌. ఎఫ్ 3 స‌క్సెస్ ని బ‌ట్టి త‌దుప‌రి భాగాల‌ కొన‌సాగింపు ఉంటుంద‌ని భావిస్తున్నారు.