Begin typing your search above and press return to search.

బాలయ్య 'ఆహా' మొత్తం విరాళమే!

By:  Tupaki Desk   |   22 Oct 2021 11:30 AM GMT
బాలయ్య ఆహా మొత్తం విరాళమే!
X
బాలీవుడ్‌ స్టార్స్ పలువురు ఇప్పటికే హోస్ట్‌ లుగా టాక్ షో లను నిర్వహించిన విషయం తెల్సిందే. హిందీలో వచ్చిన ఎన్నో సెలబ్రెటీ హోస్టింగ్‌ టాక్ షో లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు తెలుగులో కూడా స్టార్స్ టాక్ షో లు వస్తున్నాయి. ఇప్పటికే అలీ ఈటీవీలో టాక్ షో చేస్తున్నాడు. రానా నెం.1 యారీ పేరుతో టాక్ షో చేయడం జరిగింది. సమంత ఆహా కోసం టాక్ షో చేసింది. భారీ పారితోషికంతో పాటు మంచి ఫేమ్‌ కూడా వస్తున్న నేపథ్యంలో మరి కొందరు తెలుగు స్టార్స్ కూడా టాక్ షో హోస్ట్‌ ల జాబితాలో చేరుతున్నారు. ఎవరు ఊహించని పేరు నందమూరి బాలకృష్ణ ఈ జాబితాలో చేరడం అభిమానుల ఆనందంకు అవధులు లేకుండా పోయాయి. బాలయ్య ఈ షో చేయడంకు ప్రథాన కారణం ఛారిటీ అంటూ సమాచారం అందుతోంది.

బాలయ్య సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారి ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆహా లో అన్‌ స్టాపబుల్‌ టాక్ షో ద్వారా వచ్చిన ప్రతి పైసా కూడా వివిధ ఛారిటీలకు బాలయ్య ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. తన క్యాన్సర్ ఆసుపత్రితో పాటు పలు సేవా కార్యక్రమాలకు ఆ డబ్బును బాలకృష్ణ వినియోగించేలా ప్లాన్‌ చేశారట. మొదటి సీజన్ కు గాను బాలయ్య ఏకంగా నాలుగు కోట్ల కు పైగానే పారితోషికంగా తీసుకుంటున్నాడట. మొత్తం పారితోషికం అంటే నాలుగు కోట్లకు పైగానే ఛారిటీకి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. బాలయ్య సాదారణంగా భోళా మనిషి అంటారు. ఆయన మనసు చాలా సున్నితం మరియు మంచిదని దీంతో మరోసారి నిరూపితం అయ్యిందని అభిమానులు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

ఆహాలో అన్ స్టాపబుల్‌ టాక్ షో ను వచ్చే నెలలో దీపావళి సందర్బంగా స్ట్రీమింగ్‌ మొదలు పెట్టబోతున్నారు. ప్రముఖ స్టార్స్ ను బాలయ్య ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. అందులో హీరోలు హీరోయిన్స్ మరియు దర్శకులు కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య వంటి ఒక స్టార్‌ హీరో హోస్ట్‌ గా వ్యవహరించబోతున్న నేపథ్యంలో ఈ టాక్ షో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ మరియు తెలుగు రాష్ట్రాలుగా నిలిచింది. హీరోగా బాలయ్య చేసిన అఖండ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా బాలయ్య నుండి ఈ టాక్ షో రాబోతుండటం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ టాక్ షో ఆరంభం ఎపిసోడ్‌ లో అఖండ సినిమా విడుదల గురించి ఏమైనా క్లారిటీ వస్తుందా అనేది చూడాలి. భారీ ఎత్తున అంచనాలున్న అన్‌ స్టాపబుల్‌ టాక్ షో ద్వారా వచ్చే పారితోషికం తో బాలయ్య చేయబోతున్న ఛారిటీ ఏంటా అంటూ కూడా అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షో సందర్బంగానే ఆ ఛారిటీ ఉంటుందని కూడా కొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది చూడాలి.