Begin typing your search above and press return to search.

సారధిలో మొదలెట్టిన బాలయ్య

By:  Tupaki Desk   |   24 Jan 2021 3:59 AM GMT
సారధిలో మొదలెట్టిన బాలయ్య
X
నందమూరి బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా కరోనా కారణంగా మార్చిలో షూటింగ్ నిలిచి పోయిన విషయం తెల్సిందే. అప్పటి నుండి కరోనా టెన్షన్‌ కారణంగా షూటింగ్ విషయంలో ముందడుగు వేయలేక పోయారు. చాలా మంది హీరోలు షూటింగ్‌ లకు జాయిన్‌ అయినా కూడా బాలయ్య మాత్రం కాస్త ఆలస్యంగానే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఎట్టకేలకు బాలయ్య బోయపాటి కాంబో మూవీ షూటింగ్‌ పునః ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం సారధి స్టూడియోలో సినిమాకు సంబంధించిన ఒక మాస్ మసాలా సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ విషయమై యూనిట్‌ సభ్యులు లో ఫ్రొఫైల్ మెయింటెన్స్ చేస్తున్నారు.

బిబి3 లో హీరోయిన్స్ విషయమై అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాని అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ ఒక హీరోయిన్‌ గా నటించబోతుంది. ఇప్పుడు ఆమెతోనే బాలకృష్ణ షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. సారధి స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన ఒక సెట్టింగ్‌ లో మాస్‌ మసాలా సాంగ్‌ చిత్రీకరణ జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ వెంటనే ఓ భారీ యాక్షన్‌ సీన్ ను కూడా సారధి స్టూడియోలోనే చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విలన్‌ గా బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది దసరా వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.