అఖండ మాసిజం అంతా అందులోనే... ?

Mon Nov 29 2021 12:08:08 GMT+0530 (IST)

Balayya owns a mass appeal  in Tollywood

బాలక్రిష్ణ కేరాఫ్ మాసిజం. టాలీవుడ్ లో ఏ హీరోకూ లేని మాస్ అప్పీల్ బాలయ్య సొంతం. మిగిలిన హీరోలు డిఫరెంట్ జానర్లలో ట్రై చేసి సక్సెస్ కొట్టారు. బాలయ్య కూడా పౌరాణిక చారిత్రాత్మక జానపద చిత్రాల్లో నటించారు. అయితే ఆయన ఎన్ని ప్రయోగాలు చేసినా ఫ్యాన్స్ మాత్రం మాస్ కే పెద్ద ఓటు వేస్తారు. బాలయ్య సినిమా టైటిల్ నుంచి ఆయన యాక్షన్ ఫ్రాక్షన్ కంటెంట్ ఏదైనా ఏదైనా ఊర మాస్ లెక్కలు చూడాల్సిందే.బాలయ్యలోని మాసిజాన్ని కనిపెట్టి వీర లెవెల్ లో ప్రెజెంట్ చేసే ఏకైక దర్శకుడు బోయపాటి శ్రీను అనే చెప్పాలి. ఇందులో రెండవ మాటకు తావు లేదు. బాలయ్యను ఎలా చూపిస్తే థియేటర్లలో ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయో బాగా తెలిసిన డైరెక్టర్ ఆయన. అందుకే దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఆ సీక్రెట్ అందరికీ చెప్పండి అంటూ కోరారు.

ఇదిలా ఉంటే సింహా మూవీలో ఇద్దరు బాలయ్యలు ఉంటారు. ఒక బాలయ్యకు అదిరిపోయే సాంగ్స్ సెట్ చేసి పెట్టిన బోయపాటి రెండవ బాలయ్యను హుందాగా సాగే క్లాసిక్ సాంగ్ తో చూపించాడు. లెజెండ్ విషయం కూడా అంతే. ఒక బాలయ్య బీట్ సాంగ్స్ తో అదరగొడితే సీనియర్ బాలయ్య సీరియస్ యాక్షన్ తో ఆడియన్స్ ని సీట్లో నుంచి కదలకుండా చేస్తాడు. ఇక ముచ్చటగా మూడవ సినిమా అఖండలో బోయపాటి చేసిన మ్యాజిక్ ఏంటి అన్న చర్చకు వస్తే ఈ మూవీలో మూడే సాంగ్స్ ఉన్నాయని టాక్.

ఆ మూడులో రెండు డ్యూయెట్లు అయితే ఒకటి క్లాస్ రెండు ఊర మాస్. ఆ ఊర మాసే జై బాలయ్య సాంగ్. ఇక మూడవది అఖండ పాత్రధారి బాలయ్య పాత్ర మూడ్ ని ఎలివేట్ చేస్తూ సాగే సాంగ్. ఒక విధంగా చెప్పాలీ అంటే బాలయ్య ఫ్యాన్స్ కి కిర్రెక్కించే సాంగ్స్ అయితే ప్రతీ మూవీలో మరో ఒకటో రెండో ఉండాలి. కానీ బోయపాటి సినిమాలో సీరియస్ నెస్ కి బ్రేక్ వస్తుందని ఆలోచించారో ఏమో కానీ రెండు పాటలతో సరిపెట్టారు.

అయితే జై బాలయ్య సాంగ్ మాత్రం టోటల్ గా మాసిజానికి పతాకంగా ఉంటుందని చెబుతున్నారు. మొత్తం బాలయ్య ఫ్యాన్స్ కి కరవు తీరేలా ఈ సాంగ్ ని డిజైన్ చేసి వదిలారు. అంటే అఖండ మొత్తం మూవీని నిలబెట్టి సక్సెస్ రూట్ పట్టించే విధంగా మహా దిట్టంగా ఈ సాంగ్ ని దట్టించి మరీ వదిలాడు బోయపాటి అంటున్నారు. సో ఈ సాంగ్ ఒక్కటి చాలు జై బాలయ్య అంటున్నారు ఫ్యాన్స్.