అందరి దృష్టిని ఆకర్షించిన బాలయ్య లగ్జరీ కారు..!

Fri Oct 15 2021 15:00:01 GMT+0530 (IST)

Balayya luxury car that caught everyone attention

ఇన్నాళ్లూ బిగ్ స్క్రీన్ మీద ప్రేక్షకులను అలరించిన నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై సంచలనాలకు తెరలేపబోతున్నారు. మొదటిసారిగా ఓ కార్యక్రమానికి హోస్ట్ గా వ్వహరించబోతున్నారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' లో ''అన్ స్టాపబుల్'' అనే టాక్ షో బాలయ్య డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. దసరా పండగ సందర్భంగా నిన్న గురువారం ఈ టాక్ షో ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి బాలకృష్ణ వచ్చిన లగ్జరీ కారు అందరి దృష్టిని ఆకర్షించింది.''అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే'' ఈవెంట్ కు విలాసవంతమైన బెంట్లీ కారులో వచ్చారు బాలయ్య. ఆయుధ పూజ కావడంతో కారు కు పూజ చేసి పూల దండతో అలంకరించారు. దీనికి ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా అంటించబడి ఉంది. బాలకృష్ణ హిందూపూర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. బెంట్లీ విషయానికొస్తే ఈ కారు ను బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మణి ఆయనకు బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. దీని ధర రూ. 3.5 - 4 కోట్ల మధ్య ఉంది.

ఇక బాలకృష్ణ హోస్ట్ చేసే 'అన్ స్టాపబుల్' టాక్ షో విషయానికొస్తే.. ఆహా లో పది ఎపిసోడ్స్ గా అందుబాటులోకి రానుంది. 'జాంబీ రెడ్డి' ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ కార్యక్రమానికి డైరెక్షన్ చేస్తున్నారు. సినిమాల్లో తన మాస్ డైలాగ్స్ తో భారీ యాక్షన్లతో దుమ్ములేపే బాలయ్య.. ఇప్పుడు హోస్ట్ గా ఎలా చేస్తారో చూడాలి. మరోవైపు బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ''అఖండ'' సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సెట్స్ మీదకు వెళ్లనుంది.