అలా మెగా క్యాంప్ లోకి బాలయ్య ... ?

Sat Oct 16 2021 08:00:01 GMT+0530 (IST)

Balayya into the mega camp

నందమూరి బాలక్రిష్ణ గురించి అందరూ చెప్పే మాట ఒక్కటే. ఆయనకు భేషజాలు లేవు రాజకీయాలు ఏ మాత్రం తెలియవు. ఆయన నిజంగా అందరివాడు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే భోళా శంకరుడు. మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడుతారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పెస్తారు. ఆయనది వెన్న లాంటి మనసు అని ఫ్యాన్స్ అంటారు కానీ నిజంగా అదే నిజం. సినీ పరిశ్రమలో ఇలా ఉండేవారు అరుదు. నటులు అన్నాక తెర మీదనే నటిస్తారు కానీ అది అలవాటు అయిపోయి తెర వెనక నటించే వారు ఎంతో మంది. అలాంటి చిత్ర విచిత్ర సీమలో బాలయ్య లాంటి టాప్ హీరో దశాబ్దాల తరబడి కొనసాగడమే కాదు తాను ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉంటూ నెగ్గుకొస్తున్నాడు. అలాగే ఆయన సక్సెస్ అవుతున్నాడు.బాలయ్య నటనలో పోటీ పడతారు అంతే తప్ప బయట మాత్రం అందరి హీరోలతో సమానంగానే ఉంటారు. అయితే తనతో తేడా వస్తే మాత్రం ఆయన హర్ట్ అవుతారు. అలాంటి వారిని దూరం పెడతారు. ఇక అల్లు వారికి నందమూరి వారికి ఉన్న బంధం చాలా గొప్పది. ఎన్టీయార్ చిత్ర సీమలో ఎక్కువగా అభిమానించే వ్యక్తి అల్లు రామలింగయ్య. వీరిద్దరికీ చక్కని అనుబంధం. జీవితకాలమంతా అది కొనసాగింది. అల్లు అరవింద్ విషయానికి వస్తే ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద ఎన్నో సినిమాలు తీశారు. అయితే అవన్నీ కూడా మెగాస్టార్ తోనే తీసారు. అంతమాత్రం చేత ఆయన మిగిలిన హీరోలకు దూరమయ్యారని కాదు అలాంటి అనుబంధమే ఇపుడు బాలయ్యను మెగా క్యాంప్ వైపుగా నడిపించింది అని అంటున్నారు.

నిజంగా ఇది ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నదే. సినీ ఇండస్ట్రీలో బాలయ్య చిరంజీవి సినిమాల మధ్య జరిగిన పోరు అంతా ఇంతా కాదు. అయితే అప్పట్లో అంటే ఎనభై దశకంలోనే బాలయ్య చిరంజీవిలను హీరోలుగా పెట్టి మల్టీస్టారర్ తీయాలని చాలామంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చూశారు. అయితే అది ఎందుకో సాధ్యపడలేదు. ఇక తరువాత తరంలో ఆ ఫీట్ ని దర్శక ధీరుడు రాజమౌళి సాధించారు. ఇక ఇపుడు ఏకంగా ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ ని ఒకే చోట ఒకే షోలో కలుపుతూ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మల్టీస్టార్ నే చూపించబోతున్నారు. అలా మెగా క్యాంప్ వైపుగా బాలయ్య రావడం చిరంజీవితో కలసి టాక్ షో నిర్వహించడం అంటే ఇది ఎవరూ ఊహించలేనిదే. ఒక విధంగా అసాధ్యం అనుకుంటున్న దాన్ని సుసాధ్యం చేశారు అరవింద్. దటీజ్ అరవింద్ అనే చెప్పాలి. తన టాక్ షోకి చిరంజీవి కూడా వస్తున్నారు అని బాలయ్య స్వయంగా అనౌన్స్ చేశాక ఇక దాని కోసం ఇద్దరి ఫ్యాన్స్ ఇపుడు వెయింటినే వెయింటింగ్ మరి. మొత్తానికి చూస్తే అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ కి ఇది బ్రహ్మాండమైన ఫీస్ట్ గా చూడాలి.