Begin typing your search above and press return to search.

'అన్ స్టాపబుల్' స్టేజ్ పై ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బాలయ్య!

By:  Tupaki Desk   |   5 Dec 2021 12:11 PM GMT
అన్ స్టాపబుల్ స్టేజ్ పై ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బాలయ్య!
X
'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై బాలకృష్ణ టాక్ షో 'అన్ స్టాపబుల్' ఒక రేంజ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఫస్టు ఎపిసోడ్ ను మోహన్ బాబుతోను .. సెకండ్ ఎపిసోడ్ ను నానితోను చేశారు. మోహన్ బాబు ఎపిసోడ్ ఎక్కువ ఎమోషన్స్ తో నడిచింది. ఇక నాని ఎపిసోడ్ సరదాగా .. ఆటలతో సాగింది. ఈ రెండు ఎపిసోడ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మూడో ఎపిసోడ్ ను హాస్యనటుడు బ్రహ్మానందం, దర్శకుడు అనిల్ రావిపూడితోను చేశారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది.

బ్రహ్మానందం హాస్య చతురతను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వందల సినిమాలలో కామెడీని పండించిన అపారమైన అనుభవం ఆయన సొంతం. ఇక అనిల్ రావిపూడికి కామెడీపై గల పట్టు అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల్లో కామెడీ ఎపిసోడ్స్ నాన్ స్టాప్ గా నవ్విస్తూనే ఉంటాయి. ఈ ఇద్దరూ ఒక చోట చేరితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చును. అలాంటి ఈ ఇద్దరిపై బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలను సంధించి ఉంటారు? .. వాటికి వాళ్లు ఎలాంటి సమాధానాలు ఇచ్చి ఉంటారు? అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం రన్ అవుతోంది. షోలో భాగంగా అక్కినేని నాగేశ్వరరావుగారిని ఇమిటేట్ చేసి చూపించమని బ్రహ్మానందం అడిగారు. అందుకు బాలకృష్ణ వెంటనే ఓకే అంటూ .. అక్కినేని బాడీ లాంగ్వేజ్ ను .. డైలీగా డెలివరీని ఇమిటేట్ చేస్తూ ఒక సుదీర్ఘమైన డైలాగ్ చెప్పారు. ఏఎన్నార్ లా బాలకృష్ణ యాక్టింగ్ చేస్తుంటే, బ్రహ్మానందం .. అనిల్ రావిపూడి అలా చూస్తుండిపోయారు. ఇక ఈ ముగ్గురూ కలిసి 'అన్ స్టాపబుల్' స్టేజ్ పై ఏ రేంజ్ లో సందడి చేశారనేది పూర్తి ఎపిసోడ్ లో చూసేయవవచ్చు.

ప్రస్తుతం బాలకృష్ణ 'అఖండ' విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఆ తరువాత సినిమాను ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో అనిల్ రావిపూడితోను బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నారు. ఆల్రెడీ ఆయన ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా.