ఛీఛీ నేనెందుకు మాట్లాడతాను.. ఇండస్ట్రీ మనతో ఉంది: బాలయ్య సంచలన వ్యాఖ్యలు

Mon Jun 01 2020 23:00:38 GMT+0530 (IST)

Balayya Sensational Comments On Nagababu Issue

ఇటీవలే టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ.. ఇండస్ట్రీ గురించి పెద్దలు జరిపిన చర్చలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'భూములు పంచుకుంటున్నారేమో' అని చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఇండస్ట్రీలో వివాదం రేపాయి. ఆ తర్వాత నాగబాబు స్పందించి.. 'బాలకృష్ణ వెంటనే ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి సారీ చెప్పాలి' అని డిమాండ్ చేస్తూ.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా బాలయ్య ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఈ అంశంపై బాలయ్య మరోసారి స్పందించారు. ఈ మీటింగ్స్‌కు నన్ను ఎందుకు పిలవలేదో నాకు తెలియదు అన్న బాలయ్య 'గతంతో కేసీఆర్‌పై మీరు కొన్ని విమర్శలు చేశారు.అందువల్లే పిలవలేదా' అని అడగగా.. ''చెప్పొచ్చుగా నాకు.. ఆ విషయం చెప్పొచ్చుగా నాకు. కేసీఆర్‌గారికి నామీదేం కోపం లేదు. అయినా అవి రాజకీయాలు. అయినా ఇండస్ట్రీలో హిపోక్రసి సైకోఫాంటసీలు ఎక్కువ. నన్ను వేరేగా చూస్తే మాత్రం నాకు తిక్కరేగుద్ది. కేసీఆర్‌గారికి అటువంటిది ఏమీ లేదు. రామారావుగారి అభిమాని ఆయన. నేనంటే పుత్రవాత్సల్యం ఉంది ఆయనకి. అటువంటిది ఏమీ లేదు. అటువంటిది అని ఉండడు. ఎందుకు పిలవలేదో నాకు తెలియదు'' అన్నారు. ఆ తర్వాత మరో ప్రశ్నగా.. చిరంజీవి నాగార్జునగారు పిలవలేదంటారా? ఈ విషయంలో నాగబాబుగారు మీకు కూడా గొడవ జరిగిందిగా.. అని అడుగగా..

''నాకేం జరగలేదు. అతనే మాట్లాడుతున్నాడు. నేనెందుకు మాట్లాతాను..'' అని సింపుల్ గా చెప్పేసారు. దీని పై మళ్లీ ఏమైనా మాట్లాడతారా? అని అడగ్గా.. బాలయ్య వెంటనే అందుకొని.. ''నేనెందుకు మాట్లాడతాను.. అస్సలు మాట్లాడను. ఛీ ఛీ నేను మాట్లాడమేంటి? ఇండస్ట్రీ అంతా ఇవాళ.. ఆల్మోస్ట్ మనకు సపోర్టింగ్‌గా వస్తున్నప్పుడు ఇంక నేనేం మాట్లాడాలి..'' అని మాట్లాడారు. మరి దీనికి 'భూములు గురించి' అని మీరు ఏదో అన్నారుగా? అని యాంకర్ అడిగితే.. నోరు మెదపకుండా మౌనంగా.. 'ఏమో' అన్నట్లు చూసారు బాలయ్య. మరి ఈ వ్యాఖ్యలు ఎలాంటి వివాదాలకు దారి తీస్తాయో అని నెటిజన్లు చర్చిస్తున్నారు.