Begin typing your search above and press return to search.

విలన్ పాత్రలకు బాలయ్య రెడీ, కాని..!

By:  Tupaki Desk   |   7 Dec 2021 6:30 AM GMT
విలన్ పాత్రలకు బాలయ్య రెడీ, కాని..!
X
నందమూరి బాలకృష్ణ నటన విషయంలో అఖండ లో మరోసారి తన విశ్వరూపం చూపించాడు. వయసు మీద పడుతున్నా కూడా ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా అద్బుతమైన నటనతో అఖండలో మెప్పించాడు. అఖండ సినిమా సక్సెస్ జోష్ ఒక వైపు తాను హోస్ట్‌ చేస్తున్న అన్‌ స్టాపబుల్‌ షో కు విశేష ఆధరణ దక్కుతుండటం మరో వైపు. బాలయ్య ఆనందంకు హద్దు లేదు అన్నట్లుగా కనిపిస్తుంది. ఆయన మాట తీరు మరియు.. ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన ఆనందం ను చెప్పకనే చెబుతున్నారు. అఖండ టీమ్‌ తో బాలయ్య అన్ స్టాపబుల్‌ షో ను చేశాడు. ఆ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేయడం జరిగింది. ఈ శుక్రవారం స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న అఖండ స్పెషల్‌ అన్‌ స్టాపబుల్‌ కు సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌ లో నెం.1 గా ట్రెండ్‌ అవుతోంది.

ఆ ప్రోమోను చూస్తుంటే షో ఎప్పుడు చూస్తామా అన్నట్లుగా ఆసక్తి కలుగుతోంది. బోయపాటి శ్రీను.. శ్రీకాంత్‌.. థమన్‌ మరియు హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ లు పాల్గొన్న అన్ స్టాపబుల్‌ షో లో బాలయ్య ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. హీరోగా చాలా సినిమాలు చేసిన శ్రీకాంత్‌ విలన్ గా ఈ సినిమా తో ఎంట్రీ ఇచ్చాడు. విలన్ పాత్రకు శ్రీకాంత్‌ చక్కగా న్యాయం చేశాడు అంటూ టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో బాలయ్య షో లో మాట్లాడుతూ శ్రీకాంత్‌ విలన్ పాత్రకు న్యాయం చేశాడంటూ అభినందించాడు. తాను కూడా మంచి కథ వస్తే తప్పకుండా విలన్ గా నటించేందుకు సిద్దం అన్నట్లుగా చెప్పాడు. వెంటనే ఆ సినిమాలో హీరోగా కూడా నేనే ఉండాలి అంటూ కాస్త చిన్నగా కన్ను కొడుతూ చెప్పాడు.

తాను హీరోగా నటించే సినిమాలో తానే విలన్‌ గా నటించాలని అనుకుంటున్న బాలయ్య కోరిక తీరేనా చూడాలి. ఆయన మనసులో మాట బయటకు వచ్చింది కనుక రచయితలు ఇకపై ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది.. కథలు రెడీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బాలయ్య డబుల్‌ రోల్‌ చేయడం ఎన్నో సినిమాల్లో చూశాం. అయితే త్వరలోనే బాలయ్య హీరోగా.. బాలయ్య విలన్ గా డబుల్‌ రోల్‌ సినిమా చూసే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. బాలయ్య మరియు బోయపాటిల కాంబోలో వచ్చిన అఖండ సినిమా భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. వీక్ డేస్ లో కూడా సినిమా మంచి వసూళ్లు దక్కించుకుంటుంది.