Begin typing your search above and press return to search.

డాషింగ్ 'డైరెక్టర్'తో బాలయ్య మరో మూవీ ఓకే అయినట్లేనా..?

By:  Tupaki Desk   |   6 July 2020 7:15 AM GMT
డాషింగ్ డైరెక్టర్తో బాలయ్య మరో మూవీ ఓకే అయినట్లేనా..?
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహం నందమూరి బాలకృష్ణతో ఓసారి పని చేసిన దర్శకులు మళ్లీ మళ్లీ పని చేయాలనుకుంటారు. ఆయనతో అలాంటి బంధం ఏర్పడుతుంది. హిట్ ఇచ్చినా.. ఫ్లాప్ ఇచ్చినా మళ్ళీ సినిమా చేయడానికి బాలయ్య ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఇదే కోరుకుంటున్నాడు. ఇదివరకే పూరీ కూడా బాలయ్యతో మళ్లీ సినిమా చేయాలని ఉందన్నాడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన పైసా వసూల్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ బాలయ్యకు పూరీ, పూరీకి బాలయ్య తెగ నచ్చేశారట. ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఇలాంటి స్టైలిష్ సినిమా ఎవరూ చేయలేదని అప్పట్లో దర్శకుడు పూరీ గురించి బాలయ్య చెప్పడం విశేషం. పూరీతో మరో సినిమా చేయడానికి సిద్ధమే అని బాలయ్య చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూరీ కూడా ఇదే ఆ ప్రయత్నమే చేస్తున్నాడు.

ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో 'బిబి3' చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ రెస్పాన్స్ దద్దరిల్లింది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా అంటే డాన్సులు, ఫైట్లు, డైలాగ్స్ భారీ లెవెల్ లో ఎక్సపెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చూపించనున్నారో అని ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా బాలయ్య తదుపరి సినిమా గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. బాలయ్య బోయపాటి తర్వాత బి. గోపాల్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు బి. గోపాల్ సినిమా స్థానంలో పూరీ జగన్నాథ్ సినిమా ఉండబోతుందని సమాచారం. ఎందుకంటే గోపాల్ సినిమా స్క్రిప్ట్ ఇంకా పూర్తికాలేదట. అందుకే దానికి బ్రేక్ ఇచ్చి బాలయ్య పూరీ స్క్రిప్ట్ ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఆ స్టోరీ కూడా ఫోన్లో చెప్పాడట పూరీ. వెంటనే బాలయ్య ఓకే చేసాడట. మరి త్వరలో బాలయ్య - పూరీల కాంబినేషన్ మళ్లీ సందడి చేయనుందన్న మాట!