ఫ్యాన్స్ కోరిక తీర్చనున్న బాలయ్య - ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్..?

Mon May 03 2021 13:06:46 GMT+0530 (IST)

Balayya - NTR - Kalyan Ram to fulfill fans' wish ..?

నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ.. తండ్రి పేరు నిలబెడుతూ సినిమాలు చేస్తున్నారు. ఆ తర్వాతి జనరేషన్ లో తారకరత్న - కళ్యాణ్ రామ్ - జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో తారక్ స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతుండగా.. కళ్యాణ్ రామ్ నిలదొక్కుకోడానికి ట్రై చేస్తున్నారు. అయితే బాలయ్య - జూ.ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ ముగ్గురు కలిసి నటిస్తే చూడాలని ఎప్పటినుంచో నందమూరి అభిమానులు కలలు కంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఫ్యాన్స్ కల తీరనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ కలిసి 'మనం' వంటి చిరస్థాయిలో నిలిచిపోయే సినిమా చేశారు. మెగా హీరోలు కూడా అవకాశం వచ్చినప్పుడు కలిసి నటిస్తున్నారు. ఇప్పుడు 'ఆచార్య' సినిమాలో చిరంజీవి - చరణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇక దగ్గుబాటి వెంకటేష్ - రానా కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ క్రమంలో నందమూరి హీరోల మల్టీస్టారర్ కి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 2022 ఉగాది లోపు నందమూరి ఫ్యాన్స్ కి కిక్కిచ్చే రీతిన ఈ ముగ్గురు హీరోలతో ఓ మల్టీస్టారర్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. దీంతో ఈసారైనా నందమూరి త్రయం ప్రాజెక్ట్ వార్తలు నిజం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.