బాలయ్య...మోక్షజ్ఞ ఒకే ఫ్రేమ్ లో...?

Sun Nov 28 2021 05:00:02 GMT+0530 (IST)

Balayya Mokshagna In One Frame

బాలయ్య నాటౌట్ అవుట్ అంటూ అరవైలో సైతం ఇరవైలా దూకుడు చేస్తున్నారు. నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూనే అన్ స్టాపబుల్ అంటూ అహా ఓటీటీ ఫ్లాట్ ఫారం ద్వారా కావల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. బాలయ్యకు నిజంగా అన్నీ శుభ శకునాలే వచ్చినట్లుగా ఉన్నాయి. దాంతో ఆయన జోరు మామూలుగా లేదు. మంచి బ్యానర్లు డైరెక్టర్లతో ఒక వైపు సినిమాలు మరో వైపు అల్లు అరవింద్ లాంటి ప్రఖ్యాత నిర్మాతతో దోస్తీ ఈ నేపధ్యంలో బాలయ్య పనిలో పనిగా తన వారసుడిని కూడా వెలుగులోకి తేవాలని అనుకుంటున్నారుట.బాలయ్య టాక్ షోలో ఇప్పటికి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నాచురల్ స్టార్ నాని గెస్టులుగా వచ్చారు. ఇంకా విజయ్ దేవరకొండతో పాటు యంగ్ స్టార్స్ కొంతమంది వస్తారు అని టాక్ నడుస్తోంది వీరంతా ఇలా ఉంటే ఏకంగా బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ అన్ స్టాపబుల్ టాక్ షో కి వస్తే ఎలా ఉంటుంది. నిజంగా అదిరిపోయే సీనే అంటున్నారు అంతా. ఆ ముచ్చట త్వరలో తీరుతుంది అన్న మాట అయితే ప్రచారంలో ఉంది.

వరసగా సాగుతున్న బాలయ్య టాక్ షోలో ఏదో ఒక వారం మోక్షజ్ఞ వచ్చి సందడి చేస్తారు అంటున్నారు. మోక్షజ్ఞ నిజానికి ఇంకా నటుడిగా ఎంట్రీ ఇవ్వలేదు. అయితే బాలయ్యతో అప్పట్లో ఆయన సినీ ఫంక్షన్లలో కనిపించారు. ఆ తరువాత కొన్నాళ్ళకు చూస్తే ఆయన బొద్దుగా ఉన్న స్టిల్స్ వచ్చి నందమూరి ఫ్యాన్స్ ని కలవరపరచాయి. అయితే ఈ మధ్య మోక్షజ్ఞ ఫిట్ నెస్ కోసం చేస్తున్న ఎక్సర్ సైజ్ తో బాగా స్లిమ్ అయ్యాడని అంటున్నారు.

దాంతో మోక్షజ్ఞ ఎలా ఉంటాడో చూడాలన్న ఆసక్తి అయితే ఫ్యాన్స్ లో అంతకంతకు పెరిగిపోతోంది. దాంతో మోక్షజ్ఞ కనుక ఆహా టాక్ షోలో తండ్రితో కలసి అల్లరి చేస్తే ఇక బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చినట్ల. మొత్తానికి ఈ తండ్రీ కొడుకుల షోను డిజైన్ చేయడానికి అహా టీమ్ అన్ని రకాల సన్నాహాలు చేసుకుంటోందన్నది బయటకు వచ్చిన న్యూస్. ఇది నిజం కావాలని అంతా కోరుకుంటున్నారు.