Begin typing your search above and press return to search.

'బాలయ్య - అనిల్' కాంబో స్టోరీ అదేనా..??

By:  Tupaki Desk   |   22 April 2021 2:30 AM GMT
బాలయ్య - అనిల్ కాంబో స్టోరీ అదేనా..??
X
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పటాస్ నుండి గతేడాది సరిలేరు నీకెవ్వరూ వరకు వరుస హిట్లతో దర్శకుడుగా మంచి స్టార్డం అందుకున్నాడు. ప్రస్తుతం తన సక్సెస్ ఫుల్ మూవీ 'ఎఫ్2' సీక్వెల్ ఎఫ్3 తెరకెక్కిస్తున్నాడు. అయితే తదుపరి సినిమాను నటసింహం బాలయ్యతో తీయాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఈ దర్శకుడు. కొన్నేళ్లుగా బాలయ్యతో సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఇంతవరకు బాలయ్య నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదట. అయితే ఇటీవలే అనిల్ కథకు బాలయ్య ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

ఓవైపు అనిల్ సినిమాలన్ని కామెడీ ప్రధానంగా సాగుతుంటాయి. మరోవైపు బాలయ్య సినిమాలన్ని కమర్షియల్ హంగులతో మాస్ నేపథ్యంలో సాగుతుంటాయి. అలాగే బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆయనను మాస్ యాంగిల్ లో చూడటానికే ఇష్టపడతారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటితో అఖండ సినిమా చేస్తున్నాడు. ఇది వారిద్దరి కలయికలో మూడో సినిమా కాగా హ్యాట్రిక్ కొడతారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బాలయ్యతో గ్రీన్ సిగ్నల్ రప్పించుకున్నాడంటే ఇంతకీ అనిల్ ఎలాంటి కథ చెప్పి ఉంటాడని చర్చలు నడుస్తున్నాయి.

అయితే పటాస్ సమయంలోనే బాలయ్యకు 'రామారావు గారు' అనే కథను వినిపించాడట అనిల్. కానీ అప్పుడెందుకో గ్రీన్ సిగ్నల్ రాలేదు. కానీ తాజాగా బాలయ్య ఓకే చెప్పాడంటే.. కొత్త కథ చెప్పాడా లేక రామారావు కథనే అటు ఇటుగా మార్చి చెప్పాడా..? అనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉండగా.. మరి బాలయ్యను బోయపాటి తన కామెడీ యాక్షన్ జానర్ లో చూపిస్తాడా లేక బోయపాటి స్టైల్ లో మాస్ యాంగిల్ లో చూపిస్తాడా.. అని ఫ్యాన్స్ ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి డైరెక్టర్ నుండి ఎలాంటి కబురు వినిపిస్తుందో..!