Begin typing your search above and press return to search.

బాలయ్య కోసం దబంగ్ బ్యూటీ?

By:  Tupaki Desk   |   12 Dec 2019 5:49 AM GMT
బాలయ్య కోసం దబంగ్ బ్యూటీ?
X
నందమూరి బాలకృష్ణ నటించిన 'రూలర్' ఈ నెల 20 వ తేదీన విడుదల అవుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే బాలయ్య తదుపరి చిత్రం ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో బాలయ్య కు జోడీగా ఒక బాలీవుడ్ భామను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.

బాలయ్య - బోయపాటి కాంబినేషన్ కు అటు ట్రేడ్ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో అంచనాలకు తగ్గట్టే భారీగా రూ. 70 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారట. బాలయ్య సరసన బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పేరును పరిశీలిస్తున్నారట. 'దబాంగ్' సినిమాతో బాలీవుడ్ తెరపైకి దూసుకొచ్చిన సోనాక్షి ఇప్పటివరకూ పలువురు సీనియర్ హిందీ హీరోలతో జోడీ కట్టింది. ఒకవేళ సోనాక్షి కి పారితోషికం ఎక్కువ ఇవ్వాల్సి వచ్చినా హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా తిరిగి రాబట్టుకోవచ్చు. అందుకే నిర్మాతలు బాలీవుడ్ భామవైపు మొగ్గు చూపిస్తున్నారట.

అంతా అనుకున్నట్టు జరిగితే బాలయ్య సినిమాలో సోనాక్షి ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాను ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.