Begin typing your search above and press return to search.

పిర్రల మీద కొట్టి, నడుము గిల్లి శ్రీదేవి వంటి వారికి యాక్టింగ్ నేర్పించారు: బాలయ్య

By:  Tupaki Desk   |   23 July 2021 2:30 AM GMT
పిర్రల మీద కొట్టి, నడుము గిల్లి శ్రీదేవి వంటి వారికి యాక్టింగ్ నేర్పించారు: బాలయ్య
X
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తాను నటించిన 'ఆదిత్య 369' చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు న్యూస్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సినిమా విశేషాలు చెప్పిన బాలయ్య.. ఏఆర్ రెహమాన్ - భారత రత్న అవార్డ్ ల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఇవి పక్కన పెడితే ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ.. దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు షూటింగ్ సమయంలో ఏది చెబితే అది అనుకరించానని.. దిలీప్ కుమార్ ని నటన చూసి ఎగ్జాక్ట్ గా చేశానని నిజాయితీగా ఇతరుల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటానని ఒప్పుకున్నారు.

ఇంకా బాలయ్య మాట్లాడుతూ.. ''నాతో వర్క్ చేసే హీరోయిన్లలో చాలా మందికి డ్యాన్స్ విషయంలో సలహా ఇస్తుంటాను. డ్యాన్స్ చేస్తున్న 10 మంది అమ్మాయిలను గమనించి.. ఏ అమ్మాయి ఎక్స్ ప్రెషన్ నచ్చితే.. దాన్ని దించేయమని చెబుతాను. మాధురీ దీక్షిత్ కూడా అదే చేసేవారు. కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్‌ ను అదే విధంగా అనుకరించేది'' అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీదేవి వంటి పలువురు స్టార్ హీరోయిన్లకు తన తండ్రి తారక రామారావు నటన నేర్పించారని బాలకృష్ణ అన్నారు.

''శ్రీదేవి వంటి హీరోయిన్లకు నాన్నగారు ఎలాగోలా యాక్టింగ్ నేర్పించారు. కాళ్ళు తొక్కి, పిర్రలపై కొట్టి, నడుము గిల్లి.. వీపు మీద ఒక గుద్దు గుద్దడంతో ఆటోమేటిక్ గా అలా యాక్టింగ్ వచ్చేసేది. వాళ్ళు నాజూకుగా డ్యాన్స్ చేస్తుంటే.. రఫ్ గా ఉండే నాన్నగారు వారి కాలు తొక్కడంతో కొత్త ఎక్స్ ప్రెషన్ వచ్చేది. ఆ విధంగా వాళ్ళకి యాక్టింగ్ వచ్చేది. నా ప్రకారం అయితే అంతేనండి'' అని బాలయ్య చెప్పుకొచ్చారు.