Begin typing your search above and press return to search.

బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన బాలయ్య...!

By:  Tupaki Desk   |   2 Jun 2020 2:00 PM GMT
బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన బాలయ్య...!
X
నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి కోడలు.. మాజీ మంత్రి నారా లోకేష్ భార్య అయిన బ్రాహ్మణి క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించడం దాదాపు ఖాయమైందని గత ఎన్నికలప్పుడే అనుకున్నారు. పార్టీకి బలమైన విభాగంగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశాలను ఏర్పాటు చేస్తూ వారికి దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దూరమంటూ బ్రాహ్మణి గతంలో ఎన్నోసార్లు ప్రకటించారు. అయితే ఎన్నికలల ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూ కేడర్ ని ఉత్సహపరుస్తూ వచ్చేది. 2019 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ మనుగడ కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో నారా బ్రాహ్మణి లాంటి యువ నాయకురాలు.. చదువుకున్న వారు పార్టీకి అవసరమని టీడీపీ కార్యకర్తలు భావించారు. అప్పటి నుండి ఆమె పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు లేటెస్టుగా బాలయ్య బ్రాహ్మణి రాజకీయ ప్రవేశంపై ఓకే ఇంటర్వ్యూలో స్పందించారు.

బాలయ్య మాట్లాడుతూ బ్రాహ్మణికి రాజకీయాలంటే పడదని.. పాలిటిక్స్ గురించి మాట్లాడ్డం కూడా ఆమెకు నచ్చదని చెప్పుకొచ్చారు. "బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తుందని అనుకుంటున్నారు చాలామంది. తను రాజకీయాల్లోకి రాదు. తన ఎదురుగా రాజకీయాలు మాట్లాడితేనే నచ్చదు. కాకపోతే పరిస్థితుల బట్టి తను నిర్ణయం తీసుకుంటుందేమో చెప్పలేం. తనని బలవంతం పెట్టం. తన ముందు పాలిటిక్స్ మాట్లాడను'' అని పేర్కొన్నారు. అంతేకాకుండా పెద్దల్లుడు లోకేష్ చిన్నల్లుడు భరత్ ఎప్పటికప్పుడు తమ ఇంటికి వస్తుంటారని.. వీకెండ్స్ లో తామంతా కలుస్తామని.. అయితే రాజకీయాల గురించి మాత్రం పెద్దగా మాట్లాడుకోమని.. రాజకీయంగా ఏదైనా చెప్పాలనుకుంటే చెబుతారు తప్ప దానిపై పెద్దగా చర్చలు ఉండవని చెప్పుకొచ్చారు బాలయ్య. బ్రాహ్మణి రాజకీయాల్లోకి రాదంటూనే పరిస్థితుల బట్టి తను నిర్ణయం తీసుకుంటుందేమో అంటూ బాలయ్య వ్యాఖ్యానించడం గమనార్హం.