బాలయ్య ఫ్యామిలీ పిక్..ఫ్యాన్స్ లో పీక్స్!

Mon May 23 2022 10:43:39 GMT+0530 (IST)

Balakrishna family photo news update

నటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఎప్పటికప్పుడు ప్రచారం హాట్ టాపిక్ గానే సాగుతుంది. అదిగో పులి ఇదిగో తోక అన్న చందంగా మీడియా హైప్ తప్ప మోక్షజ్ఞ - బాలయ్య ఫ్యామిలీ  ఏనాడు స్పందించింది లేదు. ఆ మధ్య హీరోయిక్ లుక్ కోసం మోక్షజ్ఞ విదేశాల్లో షైన్ అవుతున్నాడని...ప్రత్యేకంగా  యూనివర్శీటీలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడని ఇలా చాలా రకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి.కానీ అవన్ని గాలి వార్తలేని తెలుస్తుంది. కేవలం మోక్షజ్ఞ స్లిమ్ లుక్..వెయిట్ తగ్గడం కోసం ఫిట్  నెస్ ట్రైనింగ్  తీసుకున్నాడు తప్ప హీరో ఎంట్రీ కోసం కాదని ఆ తర్వాతే అర్ధమైంది. తాజాగా మోక్షజ్ఞ న్యూలుక్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. బాలయ్య కుటుంబ సమేతంగా దిగిన ఫోటోలో మోక్షజ్ఞని వెబ్ మీడియా ప్రత్యేకంగా  హైలైట్ చేస్తుంది.

గతంతో  పొల్చుకుంటే  మోక్షజ్ఞ బరువు తగ్గినట్లు కనిపిస్తున్నాడు. ఫిట్ నెస్ పరంగా యాక్టివ్ గా ఉన్నాడు. క్యాజువల్ షర్ట్ ఫ్యాంట్ లో తండ్రి చాటు బిడ్డగా  మోక్ష ముందుకు సాగుతున్నాడు. ఇక బాలయ్య ఫ్యామిలి స్నాప్ చూస్తే వైట్ కలర్ ప్యాంట్..మెరుపుల షర్ట్ ల లో బాలయ్య కనిపిస్తున్నారు. తనదైన శైలిలో నుదిటిన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకున్నారు.

బాలయ్య పక్కనే ఆయన సతీమణి వసుంధరా దేవి చీరకట్టులో ఉన్నారు. వెనుకు కుమార్తె బ్రాహ్మిణి నుంచుని ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారిరింది. అందరి కళ్లు మోక్షజ్ఞ లుక్ పైనే ఉన్నాయి. హీరోయిక్ లుక్ కోసం ఇంకా శ్రమించాల్సి ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఫిజిక్ పరంగా చాలా మార్పులు తీసుకురావాలని సూచనలు..సలహాలు ఇస్తున్నారు.

ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే  ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో శ్రుతిహాసన్ బాలయ్య సరసన నటిస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్  దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే యంగ్ మేకర్ అనీల్ రావిపూడి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. సెప్టెంబర్  నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇంకా బాలయ్య కోసం మరికొంత మంది దర్శకులు వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్య `అఖండ` సక్సెస్ తో బాలయ్య మరో బ్లాక్ బస్టర్  ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.