RFC లో అమెరికా మోడల్ తో బాలయ్య దుమారం!

Wed May 18 2022 12:00:01 GMT+0530 (IST)

Balakrishna With America Model in RFC

నటసింహ బాలకృష్ణ 107వ సినిమా  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్  లుక్ పోస్టర్ తోనే బాలయ్య గర్జన ఏ రేంజ్ లో ఉంటుందో రివీల్ చేసారు. సింహం తరహా లోనే మరోసారి బాలయ్య దుమారం రేపనున్నారని తెలుస్తుంది. 'అఖండ'తో మంచి సక్సెస్ ని ఖాతాలో వేసుకున్న బాలయ్య 107 తో అదే సన్నివేశాన్ని రిపీట్ చేస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై అంచానాలు అదే స్థాయిలో ఉన్నాయి.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా సెట్  నిర్మించి  బాలయ్య పై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ పాట అంటే హీరోయిన్ తో కాదండోయ్..బాలయ్య స్టైల్ ఐటమ్ సాంగ్. అవును ఆర్ ఎఫ్ సీలో ఐటం సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది.

అందుకోసం ఏకంగా  ఆస్ట్రేలియన్ మోడల్ నే రంగంలోకి దించారు. ఆమె పేరు చంద్రిక రవి ఈ స్పెషల్ సాంగ్ లో యువతని ఊపేయనడానికి రెడీ అయింది. అదే రేంజ్ లో బాలయ్య  సిగ్నెచర్ స్టెప్పులు పాటలో హైలైట్ అవుతాయి. ఇక ఐటం సాంగ్ ని థమన్ తనదైన శైలిలో మాస్ బీట్ తో కంపోజ్ చేసారు. అభిమానులు మెచ్చే ఫుట్‌టాపింగ్ నంబర్‌ను స్కోర్ చేసారు.

తమన్ మార్క్ పాటలో ఖచ్చితమట. బాలయ్య మాస్ ఫాలోయింగ్ కి ఏ మాత్రం తగ్గకుండా తమన్ కంపోజ్ చేసినట్లు తెలుస్తుంది. పాటలో బాలయ్య ఎనర్జీ  అసాధారణంగా ఉంటుందిట. 30 ఏళ్ల బాలయ్యని పాటలో చూస్తామని టాక్ వినిపిస్తుంది. ఈ పాటని శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఆర్‌ఎఫ్‌సిలో వేసిన భారీ సెట్‌లో ఐటెం సాంగ్ చిత్రీకరిస్తున్నారు.

బాలకృష్ణ-చంద్రిక రొమాంటిక్ పెర్పార్మెన్స్ పాటలో హైలైట్ అట. కేవలం ఈ ఒక్క పాట కోసం చంద్రిక అమెరికా ప్లైట్ ఎక్కి వచ్చింది. మెడల్ గా స్థిరపడిన చంద్రిక ఆస్ర్టేలియాలో ఉండేది. అక్కడ నుంచి మకాం సినిమా కెరీర్ కోసం అమెరికాకి మార్చింది.

ప్రస్తుతం బాలయ్య సినిమా కోసం హైదరాబాద్ లో  ఉంది. ఇక సినిమాలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మాస్ ఎంటర్ టైనర్ ని నిర్మించడానికి ముందుకొచ్చింది.