బాలయ్య అన్ స్టాపబుల్ 2.. దూసుకెళ్తున్న రికార్డులు..!

Tue Dec 06 2022 22:24:59 GMT+0530 (India Standard Time)

Balakrishna Unstoppable 2 Breaking Records

బాలకృష్ణతో టాక్ షో అనగానే ముందు అందరు డౌట్ పడ్డారు కానీ ఆయన ఎంటీ ఇవ్వనంత వరకే ఏ రికార్డ్ అయినా వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటూ అన్ స్టాపబుల్ గా తన హంగామా కొనసాగిస్తున్నారు బాలకృష్ణ. ఆహా ఓటీటీ కోసం అన్ స్టాపబుల్ టాక్ షో మొదలు పెట్టిన బాలయ్య సీజన్ 1 సెన్సేషనల్ హిట్ కాగా అదే జోష్ తో అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ప్లాన్ చేశారు.ఎంతో జోష్ ఫుల్ గా మొదలైన అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ తోనే సర్ ప్రైజ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు లోకేష్ తో స్పెషల్ చిట్ చాట్ చేసి అదరగొట్టారు. అంతేకాదు ఫస్ట్ టైం చంద్రబాబుని ఫ్యామిలీ మెన్ గా చూపించే ప్రయత్నం చేశారు.

అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎపిసోడ్ 2 లో యువ హీరోలతో చేశారు. ఇక అలా సాగుతున్న ఈ సీజన్ ఐదవ ఎపిసోడ్ లో ఇద్దరు బడా నిర్మాతలు.. ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ ని తీసుకొచ్చారు. నిర్మాతల్లో సురేష్ బాబు అల్లు అరవింద్ పాల్గొనగా.. డైరెక్టర్స్ లో రాఘవేంద్ర రావు కోదండ రామిరెడ్డి అటెండ్ అయ్యారు. ఈ ఎపిసోడ్ లో చాలా విషయాల గురించి ప్రస్తావించారు.

ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో నెపోటిజం థియేటర్ల సమస్య మీద హాట్ డిస్కషన్స్ జరిగాయి. అందుకే ఈ ఎపిసోడ్ బాగా వైరల్ అయ్యింది. సినీ ఫోక్స్ అంతా కూడా ఆహాలో ఈ ఎపిసోడ్ ని బాగా చూశారు ఎంతగా అంటే రెండు రోజుల్లోనే 30 మిలియన్ల మినిట్స్ వ్యూస్ సాధించేలా చేశారు.

బాలయ్య అన్ స్టాపబుల్ షోకి వస్తున్న రెస్పాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్కడ ఇక్కడ అని కాదు వరల్డ్ వైడ్ తెలుగు ఆడియన్స్ అంతా కూడా ఈ స్పెషల్ ఎపిసోడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ టైం కలిసి రావడం వల్ల ఆహా ఓటీటీ మరింత క్రేజ్ తెచ్చుకుంది. ముందు కేవలం సినిమాలు మాత్రమే రిలీజ్ చేస్తూ వచ్చిన ఆహా ఆ తర్వాత రిజినల్ సీరీస్ లు సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక ఈమధ్య రకరకాల షోస్ కూడా చేస్తుంది. ఎన్ని చేసినా బాలయ్య అన్ స్టాపబుల్ షో మాత్రం అన్నిటికన్నా టాప్ లో నిలిచింది.

అన్ స్టాపబుల్ సీజన్ 1 రికార్డులను కూడా ఈ సీజన్ 2 దాటేస్తుంది. బాలయ్య ఎనర్జిటిక్ హోస్టింగ్ టాలెంట్ ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది. తనలో ఈ సరికొత్త యాంగిల్ తో బాలకృష్ణ సినీ ప్రియులకు మరింత దగ్గరవుతున్నాడు. నందమూరి ఫ్యాన్స్ కి మాత్రమే కాదు సినీ ప్రేక్షకులందరికీ అన్ స్టాపబుల్ షో తెగ నచ్చేసింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.