Begin typing your search above and press return to search.

బాలయ్యతో తెలంగాణ బ్యాక్ డ్రాప్!

By:  Tupaki Desk   |   23 Jan 2023 11:00 AM GMT
బాలయ్యతో తెలంగాణ బ్యాక్ డ్రాప్!
X
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన వీరసింహారెడ్డి సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ మీట్ ని తాజాగా నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ఇక ఈ సక్సెస్ మీట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన బాలకృష్ణతో తాను చేయబోతున్న సినిమా గురించి ఆసక్తికర అప్డేట్స్ ఇచ్చాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు బాలకృష్ణ సినిమాలు అందరూ చూసారు.

ఇక రాయలసీమ నేపధ్యంలో బాలకృష్ణ విద్వంసం కూడా చూసారు. అయితే నెక్స్ట్ తన సినిమాలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో చూడబోతున్నారు. తెలంగాణ యాసతో బాలయ్య విద్వంసం ఎలా ఉంటుందో చూస్తారు.

బాక్సాఫీస్ ఊచకోత తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథతో వస్తున్న తమ సినిమాతో ఉంటుంది. బాలకృష్ణ నుంచి ఫ్యాన్స్ కోరుకునే ఆ మాస్, ఆ యాక్షన్ అలాగే ఉంటాయి. ఈ సినిమాలో బాలయ్య బాబు టచ్ కచ్చితంగా ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

అయితే దానికి నా టచ్ కూడా ఉంటుంది అని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. దీనిని బట్టి అనిల్ రావిపూడి కథని తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్నాడు అని అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమాకి కూడా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాసే ఛాన్స్ ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో బాలయ్య చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ కావడంతో ఫిబ్రవరి నుంచి అనిల్ రావిపూడి సినిమా సెకండ్ షెడ్యుల్ ప్రారంభించే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. ఇక ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి ఇద్దరు హీరోయిన్స్ ని రంగంలోకి దించుతున్నారు. మొత్తానికి బాలయ్యతో తాను ఎలాంటి సినిమా చేయబోతున్నది అనిల్ రావిపూడి వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో చెప్పేసాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.