బాలయ్య ఫ్యాన్స్ కు మోక్షజ్ఞ టెన్షన్

Tue Jun 11 2019 10:23:28 GMT+0530 (IST)

Balakrishna Fans on About Mokshagna Look

నందమూరి బాలకృష్ణ ఏకైక నటవారసుడిగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఓ రెండేళ్ళ క్రితం బాలయ్య ఇంకో ఏడాది లేదా త్వరలో అని చెప్పేవారు కాని ఇప్పుడా ఊసు ఎత్తడం లేదు. నిజంగా మోక్షజ్ఞకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదా అనే టాక్ ఫిలిం నగర్ లో ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతుండగా దానికి బలం చేకూర్చేలా బయట కనిపిస్తున్న మోక్షజ్ఞ తాలుకు పిక్స్ ఫ్యాన్స్ ని ఇంకా ఎక్కువ టెన్షన్ పెడుతున్నాయి.కారణం అందులో తాను బొద్దుగా ఉండటమే. మరీ ఎక్కువ అని కాదు కాని ఇప్పుడున్న ట్రెండ్ లో యూత్ టేస్ట్ కి అనుగుణంగా కనిపించాలంటే ఇలా ఉంటె సరిపోదు. బరువు తగ్గించుకుని ఫిజికల్ ఫిట్నెస్ మీద  దృష్టి సారించాలి. కాని మోక్షజ్ఞ దాని మీద ఇంకా ఫోకస్ పెడుతున్నట్టు అనిపించడం లేదు. .ఒకపక్క బాలకృష్ణ వంద సినిమాలు పూర్తి చేసుకుని ఇప్పుడు 105కు రెడీ అవుతున్నాడు. ఇప్పటికిప్పుడు కాకపోయినా మోక్షజ్ఞ ప్రవేశం ఎప్పుడు ఉంటుందో చెప్పాలని  అభిమానుల డిమాండ్. కాని నిజంగా ఆ ఇద్దరి మనసులో ఏముందో అర్థం కాక మీడియా సైతం ఒకరకమైన కన్ఫ్యూజన్ లో ఉంది.

మోక్షజ్ఞతో మొదటిసినిమా నేనే తీస్తానని గతంలో ప్రతిజ్ఞ చేసిన నిర్మాత సాయి కొర్రపాటిని అడుగుదామా అంటే ఆయనా అందుబాటులో లేరు. నాన్ననే స్పష్టంగా చెప్పలేనప్పుడు సాయి మాత్రం చేసేదేముంది. సో మోక్షజ్ఞ లుక్స్ కొంత ఆందోళన కలిగించడం అనే విషయం పక్కన పెడితే ఇంకో రెండు మూడేళ్ళలో కనక బాలయ్య వారసుడి తెరంగేట్రం కనక జరగకపోతే పైన చెప్పిన అనుమానాలు నిజమయ్యే అవకాశం లేకపోలేదు