నాగబాబు డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నాడా...?

Fri May 29 2020 23:00:55 GMT+0530 (IST)

Nagababu playing dual role ...?

మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెరతో పాటు అటు బుల్లితెరపై కూడా కాలు మోపి తెలుగు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా 'నా ఛానల్ నా ఇష్టం' అంటూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్తూ వస్తున్నాడు. ఈ మధ్య రాజకీయాలపైన సమకాలీన అంశాలపైనా తనదైన శైలిలో స్పందిస్తున్నాడు. అప్పుడప్పడూ వివాదాస్పద వ్యాఖ్యలతో ట్వీట్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే ఇప్పుడు తాజాగా నాగబాబు మరో వివాదానికి తెరలేపాడు. నిన్న బాలయ్య తనను ఇండస్ట్రీలో జరిగే చర్చలకు పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నాగబాబు స్పందిస్తూ బాలయ్యని నోరు అదుపులో పెట్టుకోవాలని ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. ''బాలకృష్ణగారు నోరు జారొద్దు.. నోటిని కంట్రోల్ లో పెట్టుకోవాలని.. సమావేశానికి ఎవర్ని పిలవాలో.. ఎవర్ని పిలవకూడదో కమిటీకి తెలుసు అని ఆవేశంగా మాట్లాడారు. భూములు పంచుకోవడానికి సమావేశం కాలేదని.. ఈ వ్యాఖ్యలను వెంటనే బాలయ్య వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం సరికాదని.. చిత్ర పరిశ్రమనే కాదు తెలంగాణ ప్రభుత్వాన్నీ అవమానించారంటూ ఫైర్ అయ్యారు నాగబాబు. ప్రభుత్వం సినీ పరిశ్రమకు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసారు. భవిష్యత్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారో.. ఒకసారి ఏపీకి వెళ్తే తెలుస్తుంది.. వ్యాపారం చేసి ఏపీని ఎవరు సర్వనాశనం చేశారనేది అందరికీ తెలుసన్నారు. బాలకృష్ణ ఏం మాట్లాడినా నోరు మూసుకుని కూర్చోమని.. ఇండస్ట్రీకి ఆయనేం కింగ్ కాదు.. జస్ట్ హీరో మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు నాగబాబు.అయితే ఇప్పుడు నాగబాబు వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాలయ్య మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని.. మెగాస్టార్ ఇంట్లో మీటింగ్ పెట్టుకొని ఆయనని ఆహ్వానించక పోవడం వల్లనే బాలయ్య అసహననానికి గురయ్యారని కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన మీటింగ్స్ ఆఫీసియల్ గా ఫిలిం ఛాంబర్ లో పెట్టుకోవాలి కానీ ఇలా చిరంజీవి ఇంట్లో పెట్టుకోవడం ఏంటని పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మరియు నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బాలయ్యని పిలవకుండా చిరంజీవి ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడం.. కేవలం నువ్వొక హీరోవి మాత్రమే అని బాలకృష్ణను నాగబాబు అనడం ఇండస్ట్రీలో ఒక వర్గానికి బాగానే కోపం తెప్పించిందట. అయితే నాగబాబు కావాలనే ఈ ఇష్యూలో తల దూర్చాడని.. చిరు చేసిన మిస్టేక్ ని దారి మళ్లించడానికే నాగబాబు బాలయ్య పై రివర్స్ కౌంటర్ ఇవ్వడానికి వచ్చాడని కామెంట్స్ చేసే వాళ్ళు లేకపోలేదు. అంతేకాకుండా నాగబాబు రియాక్టయింది సినీ ఇండస్ట్రీని అన్నాడనో తెలంగాణా ప్రభుత్వాన్ని అన్నాడనో కాదని.. బాలయ్య ఇండైరెక్ట్ గా చిరంజీవిని అన్నాడని రియాక్టయ్యాడని వారు విమర్శిస్తున్నారు. నాగబాబు ఫ్యామిలీకి స్పోక్స్ పర్సన్ గా మారిపోయాడని.. ఎవరైనా మెగా ఫ్యామిలీని అంటే వెంటనే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ట్విట్టర్ ద్వారా వారిపై విరుచుపడుతూ వస్తున్నారని సోషల్ మీడియాలో డిస్కషన్ చేసుకుంటున్నారు. జనసేన పార్టీ నేత అయిన నాగబాబు అటు రాజకీయ నాయకులపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కౌంటర్ ఇస్తూ వస్తున్నాడని.. ఈ విధంగా నాగబాబు మెగా ఫ్యామిలీ కోసం డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నాడని వారు కామెంట్స్ చేస్తున్నారు.