Begin typing your search above and press return to search.

బాలయ్య అన్నది ఏ భూముల గురించి??

By:  Tupaki Desk   |   29 May 2020 6:45 AM GMT
బాలయ్య అన్నది ఏ భూముల గురించి??
X
తెలుగు సినీ పరిశ్రమ తరఫున షూటింగులకు అనుమతినివ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన బృందంలో చిరంజీవి.. నాగార్జున.. రాజమౌళి.. త్రివిక్రమ్ తదితరులు ఉన్నారు. అయితే ఈ విషయం పై ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ బాలయ్య "నన్ను ఎవరూ పిలవలేదు. నన్నెవరు పిలిచారు. వీళ్లందరూ హైదరాబాద్ లో శ్రీనివాస్ యాదవ్ తో కూర్చుని భూములు పంచుకుంటున్నారా?" అంటూ తనదిన శైలిలో మండిపడ్డారు.

ఇక దీనికి స్పందన అన్నట్టుగా "ఈ వీడియో ఎవరికీ సంబంధం లేదు" అంటూనే నాగబాబు రంగంలోకి దిగి బాలకృష్ణ తనను పిలవలేదని చెప్పడం వరకూ ఓకే కానీ "భూములు పంచుకుంటున్నారని ఉక్రోషంగా మీరు మాట్లాడడం సరి కాదు. ఈ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం సరి కాదు. అలానే మాట్లాడతానంటే దానికి పదింతలు మాట్లాడడానికి చాలామంది రెడీగా ఉన్నారు. కొంచెం నోరు కంట్రోల్ చేసుకుని మాట్లాడండి బాలకృష్ణ గారు" ఆయన శైలిలో కౌంటర్ ఇచ్చారు. పనిలో పనిగా ఆంధ్ర ప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ భాగోతాలు అందరికీ తెలుసని అమరావతి అంశం పరోక్షంగా ప్రస్తావించారు.

ఇదిలా ఉంటే మరో టీవీ డిస్కషన్లో నాగబాబుకు ఇదే విషయంపై ప్రశ్న ఎదురైంది. "ఎపీలో రాజధాని భూముల విషయం కెలికితే అది మీకు చుట్టుకుంటుంది కదా? " అని అడిగితే సమాధానం ఇస్తూ " ఫర్వాలేదు.. చుట్టుకోమనండి. మామీద ఎంక్వైరీ చేసుకోమనండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఎంక్వైరీ చేసుకోమనండి.. కళ్యాణ్ బాబే ఇంతకు ముందు ఈ విషయం చెప్పాడు.. కొత్తగా నేను చెప్పేదేంటి?" అంటూ తన వెర్షన్ వినిపించారు.

ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే ఇప్పుడు ఎక్కువమందికి అనుమానాలు రేకెత్తుతున్న అంశం హైదరాబాద్ లో భూముల పంపకం. అమరావతి కథ అందరికీ తెలుసు కాబట్టి కొత్తగా చెప్పేదేమీ లేదు. అయితే బాలయ్య ఏ భూముల గురించి విమర్శలు చేశారు? నిజంగా అలాంటి డిస్కషన్ ఏదైనా ఉందా? చిరంజీవి క్యాంప్ ను బాలయ్య విమర్శించాలి అనుకుంటే ఎన్నో టాపిక్స్ ఉంటాయి.. అలాంటప్పుడు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో కూర్చుని భూముల పంచుకుంటున్నారా.. అనే ఆరోపణ ఎందుకు చేసినట్టు? బాలయ్య ఏదో ఫ్లోలో అన్నప్పటికీ దానికి ఏదో కారణం ఉంటుందని ఇప్పుడు చాలామంది ఆరాలు తీస్తున్నారు.